Dharmasthala: ఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థల వార్తల్లో ప్రధానాంశంగా మారింది. ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియా వ్యాప్తంగా ఇదే హోరు. హిందువులకు ఎంతో పవిత్రమైన స్థలంలో వందలాది మృతదేహాలను బలవంతంగా ఖననం చేశానని అక్కడ పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుడు ఆరోపించడం సంచలనంగా మారింది.