త్వరలోనే బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి తలపడనున్నాయి. ఇప్పటికే రెండు దశాబ్దాలకు పైగా నితీష్ కుమార్ నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తోంది. అయితే ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవిని చేజార్చుకోకూడదని కాషాయ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా నితీష్‌కుమార్‌ను పక్కన పెట్టాలని కమలనాథులు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర మాదిరిగా ముఖ్యమంత్రి అభ్యర్థి లేకుండానే బీహార్‌లో కూడా ఎన్నికల బరిలోకి దిగాలని బీజేపీ భావిస్తోంది. మహారాష్ట్రలో అనూహ్యంగా ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. అదే మాదిరిగా బీహార్‌లో చేసేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది.
ఇది కూడా చదవండి: Mega Star : విశ్వంభర ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల
ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అశ్విని కుమార్ చౌబే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి నితీష్‌కుమార్(74)ను గౌరవప్రదంగా పంపించాలని కోరారు. ఆయనకు ఉప ప్రధాని పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పుకొచ్చారు. దివంగత జగ్గీవన్ రామ్ బీహార్ నుంచి ఉప ప్రధాని అయ్యారని.. రెండో వ్యక్తిగా నితీష్‌కుమార్‌ను ఉప ప్రధానమంత్రిగా చూడాలని అనుకుంటున్నట్లు ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకోసం తన మద్దతు నితీష్ కుమార్‌కు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: AP Inter Results 2025: ఇంటర్ ఫలితాల విడుదల… ఇక్కడ క్లిక్ చేయండి..
ఇదిలా ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమారుడు నిశాంత్ రాజకీయ అరంగేట్రం చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ జేడీయూ నేతలు మాత్రం అనేక చోట్ల పోస్టర్లు వేశారు. అయితే ఈ వార్తలను నిశాంత్ ఖండించారు. వచ్చే ఎన్నికల్లో నితీష్ కుమార్ ఆధ్వర్యంలో ముందుకెళ్తారని తెలిపారు. మరోవైపు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో నితీష్ కుమార్ భవిష్యత్ దారుణంగా ఉంటుందని.. ఘోరంగా ఓడిపోతారని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Hyderabad: ఆస్తి కోసం యువతి హత్య.. సవతి తల్లితో సహా ముగ్గురు అరెస్టు