NTV Telugu Site icon

Tamil Nadu: డీలిమిటేషన్‌పై స్టాలిన్ నేతృత్వంలో నేడు దక్షిణాది సీఎంల భేటీ

Mkstalin

Mkstalin

డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలు సమర శంఖారావాన్ని పూరించాయి. ఇప్పటికే ఢిల్లీ వేదికగా తమిళనాడు డీఎంకే ఎంపీలు పోరాటం చేస్తున్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళనలు, నిరసనలు తెలుపుతున్నారు. తాజా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో కీలక సమావేశం జరగబోతుంది. శనివారం తమిళనాడు వేదికగా దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష సమావేశం జరగనుంది.

ఇది కూడా చదవండి: KKR vs RCB: మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే ఏంటి పరిస్థితి..?

చెన్నైలోని గిండి సమీపంలో ఐటీసీ ఛోళా హోటల్‌లో ఉదయం 10 గంటలకు సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పలు రాష్ట్రాల సీఎంలతో పాటు ఆయా పార్టీల కీలక నేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత లేదని.. కేవలం దక్షిణాది ఉనికి కోసమే నేతలందరూ రావాలని సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళ, పంజాబ్, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించిన నేతలంతా హాజరుకానున్నారు.

ఇది కూడా చదవండి: KKR vs RCB: నేడు కోల్‌కతా-బెంగళూరు మధ్య తొలి మ్యాచ్.. వర్షం ముప్పు..!

తెలంగాణ కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, టీఆర్ఎస్ తరపున కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్, రాజ్యసభ ఎంపీలు హాజరుకానున్నారు. ఇక కేరళ నుంచి ముఖ్యమంత్రి విజయన్, పంజాబ్ నుంచి ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కర్ణాటక నుంచి డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ పాల్గొననున్నారు. ఇక తమిళనాడు అసెంబ్లీలోనూ.. అఖిలపక్ష సమావేశంలోనూ ఇప్పటికే స్టాలిన్ డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేశారు.

ఇది కూడా చదవండి: Off The Record: కొలికపూడి మ*ర్డర్ స్కెచ్..? జనసేన కంప్లైంట్.. ఏంటి ఈ కథ..!