Intel Alert: ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర.. నిఘా వర్గాల హెచ్చరికతో హై అలర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Intel Alert: దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రవాద దాడి జరుగొచ్చని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హెచ్చరించాయి. కీలక ప్రాంతాల్లో ఐఈడీలతో దాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు చెప్పడంతో, భద్రతను భారీగా మోహరించారు. ముప్పు దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయం, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్‌లోని దాని కార్యాలయం, సమీపంలోని ప్రభుత్వ సంస్థల వద్ద భద్రతను పెంచారు. అదనపు పోలీసు బలగాలను మోహరించారు, బారికేడ్లను పెంచారు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
Read Also: Milk: ఈ 8 ఆహారాలను పాలతో కలిపి తీసుకుంటే రిస్క్‌లో పడ్డట్లే..
Also Read
- Trump: టర్కీకి బయల్దేరే ముందు ఓవల్ ఆఫీస్‌లో ఏం జరిగింది.. ఇరాన్‌పై ట్రంప్ యుద్ధానికెళ్లడానికి కారణమిదేనా?
- US-Iran War: ఇరాన్లో భారత్-చైనాలను దెబ్బతీసిన అమెరికా..
- Hardeep Singh Puri: త్వరలో చౌకగా E85! ఇథనాల్‌తో ఇంజిన్ దెబ్బతింటుందన్న పుకార్లు నమ్మొద్దు
- El Nino: ఎల్‌నినోతో వర్షాలుండవన్నారు.. ఇప్పుడెందుకు భారత్‌ను ముంచెత్తున్నాయి.. కారణమేంటి?
సెంట్రల్ ఢిల్లీలోని కీలక కార్యాలయాలు, రద్దీగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగవచ్చని ఏజెన్సీలకు సమాచారం అందింది. ఆత్మాహుతి దాడులు, వాహనాల్లో ఐఈడీలు పెట్టి పేల్చడం, కాల్పులు, సమన్వయ దాడులు జరగవచ్చని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు భావిస్తున్నాయి. ప్రభుత్వ భవనాలు, రాజకీయ కార్యాలయాలు, మార్కెట్లు, రవాణా కేంద్రాలు, ఇతర రద్దీ ప్రదేశాల్లో తనిఖీలు ప్రారంభించారు. బాంబ్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్, క్విక్ రియాక్షన్ టీములను అప్రమత్తం చేశారు. ఢిల్లీ ఫైర్ సర్వీస్‌ను అప్రమత్తం చేశారు.
ఇటీవల, పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఆదేశాల మేరకు భారత్ లో ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నుతున్న పాకిస్తానీ గ్యాంగ్ స్టర్, ఉగ్రవాది షాజాద్ భట్టి ముఠాను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఛేదించింది. 9 మంది నిందితుల్ని అరెస్ట్ చేసింది.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్‌ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్‌లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!