Delhi : ఢిల్లీలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. పొగమంచు కారణంగా 53 విమానాలు రద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో చలి తీవ్రత పెరుగుతూ వస్తుంది.. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి.. ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. దాంతో తప్పనిసరి అయితే తప్ప ఉదయం, రాత్రి వేళల్లో జనం ఇళ్ల నుంచి కాలు బయటపెట్టాలంటేనే భయపడిపోతున్నారు.. ఢిల్లీలో చలి మరింత తీవ్రంగా ఉంది. గడిచిన రెండు వారాల మాదిరిగానే ఈ రోజు ఉదయం కూడా అక్కడ 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉదయం బయటికి వచ్చేవాళ్లే లేరు.. కొన్ని పరిస్థితుల కారణంగా బయటకు వచ్చిన జనం చలికి గజగజ వణుకుతున్నారు. ఎముకలు కొరికే చలికి తాళలేక పలు ప్రాంతాల్లో జనం చలిమంటలు వేసుకుంటున్నారు. ఇళ్లు కూడా లేని నిస్సహాయులకు ఢిల్లీలోని నైట్ షెల్టర్‌లు బాగా ఉపయోగపడుతున్నాయి.. ఈ చలి కారణంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లో ఉదయం వేళల్లో దట్టంగా పొగమంచు కమ్ముతోంది.
Also Read
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
- Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
- Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
- SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
పొగ మంచు దట్టంగా ఉండటం వల్ల రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాలు రెండు, మూడు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి.. ఉదయం పూట వెళ్ళాల్సిన కొన్ని రైళ్లు పూర్తిగా రద్దయినట్లు తెలుస్తుంది.. దట్టమైన పొగమంచు కారణంగా దాదాపు 120 విమానాలు (దేశీయ మరియు అంతర్జాతీయ) రాకపోకలు మరియు నిష్క్రమణలను ప్రభావితం చేసే విమాన కార్యకలాపాలలో ఆలస్యం అవుతుందని అధికారులు ప్రకటించారు.. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని తెలుస్తుంది..
#WATCH | Delhi | Passengers await the movement of their scheduled flights as several flights get delayed and a few get cancelled due to fog in several parts of the country.
Visuals from Indira Gandhi International Airport. pic.twitter.com/srYSDAfqkh
— ANI (@ANI) January 17, 2024
తాజావార్తలు
-
Ather Konarc S: ఫుల్ ఛార్జ్‌తో 161KM రేంజ్.. 3.5kWh బ్యాటరీ, రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
-
Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
-
Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
ట్రెండింగ్
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!