Delhi Police Suspends 11 Cops For Negligence In Delhi Car Horror Case: జనవరి 1వ తేదీన ఢిల్లీలోని కాంఝావాలా రోడ్డు ప్రమాదం కేసులో కేంద్రం హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో భాగంగా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 11 మంది పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంది. వారిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీరిలో ఒక డీసీపీ స్థాయి అధికారి కూడా ఉన్నారు. ఏ రహదారిలో అయితే ఈ రోడ్డు ప్రమాదం సంభవించిందో.. ఆ రూట్‌లో ఈ సస్పెండ్ అయిన అధికారులు డ్యూటీలో ఉన్నారు. ఆరోజు వీరంతా మూడు పోలీస్ కంట్రోల్ రూమ్ వ్యాన్లు, రెండు పికెట్లలో విధులు నిర్వహించారు. అయితే.. వీరంతా తమ విధుల్ని సరిగ్గా నిర్వహించకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలింది. ఆ పోలీసులపై ప్రజల నుంచి కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆ 11 మంది అధికారులపై కేంద్ర హోంశాఖ వేటు వేసింది.
KL Rahul: రాహుల్ ఇన్నింగ్స్ గొప్పదేం కాదు.. మాజీ క్రికెటర్ బాంబ్
కాగా.. జనవరి 1వ తేదీన అర్థరాత్రి అంజలి అనే యువతి ఒక హోటల్‌లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకొని, తన స్నేహితురాలు నిధితో కలిసి ఇంటికి బయలుదేరింది. ఒక ప్రాంతంలో వేగంగా దూసుకొచ్చిన కారు.. వీరి స్కూటిని ఢీకొట్టింది. కారులో ఉన్న నిందితులందరూ మద్యం మత్తులో ఉన్నారు. ఈ ప్రమాదంలో అంజలి స్నేహితురాలు నిధి స్వల్ప గాయాలతో బయటపడగా.. అంజలి మాత్రం కారు చక్రాల మధ్య ఇరుక్కుంది. అది గమనించకుండా.. 12 కిలోమీటర్లు కారుని నడుపుతూ, ఆమెను ఈడ్చుకెళ్లారు. ఈ కిరాతక ఘటనలో యువతి మృతిచెందింది. తెల్లవారుజామున నడిరోడ్డుపై నగ్నంగా ఆమె మృతదేహం లభ్యమవ్వడంతో.. దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. నిందితుల్ని గుర్తించి, వారిని అరెస్ట్ చేశారు. ఈ కేసు నుంచి తమ స్నేహితుల్ని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరినీ కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Carrot Juice : క్యారెట్ జ్యూస్ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!