Delhi: ఢిల్లీని కమ్మేసిన చీకట్లు.. మధ్యాహ్నమే అర్ధరాత్రిని తలపించిన ఇసుక తుఫాన్!
- ఢిల్లీ - ఎన్సీఆర్లో ప్రకృతి విలయం..
- 92 కి.మీ వేగంతో ఇసుక తుఫాన్..
- ‘రెడ్ అలర్ట్’ జారీ చేసిన ఐఎండీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: దేశ రాజధాని ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో (NCR) వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, ఫరిదాబాద్లలో భారీ ఇసుక తుఫాన్ (Dust Storm) విరుచుకుపడింది. పాలం ప్రాంతంలో గంటకు ఏకంగా 92 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈ ధూళి గాలుల కారణంగా రోడ్లపై చీకట్లు కమ్ముకున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకే అర్ధరాత్రిని తలపించేలా దట్టమైన దుమ్ము, ధూళి వ్యాపించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విజిబిలిటీ (కనిపించే దూరం) పూర్తిగా పడిపోవడంతో హెడ్లైట్లు ఆన్ చేసుకుని వాహనాలు నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఢిల్లీకి ‘రెడ్ అలర్ట్’.. రంగంలోకి ఐఎండీ
రాజధానిలో నెలకొన్న ప్రమాదకర పరిస్థితులను దృష్ట్యా భారత వాతావరణ శాఖ (IMD) ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. రానున్న కొన్ని గంటల్లో వాతావరణం మరింత క్షీణించే అవకాశం ఉందని హెచ్చరించింది. పిడుగులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఎన్సీఆర్ పరిధిలోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు. హర్యానాలోని రోహ్తక్ మీదుగా ఏర్పడిన ఒక శక్తివంతమైన మేఘాలు ఆగ్నేయ దిశగా ఢిల్లీ వైపు వేగంగా దూసుకొస్తోందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఇప్పటికే ఢిల్లీ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై, పలుచోట్ల చినుకులు పడుతున్నాయి. రానున్న గంటల్లో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, కొన్నిసార్లు ఇవి 80 కిలోమీటర్ల వేగాన్ని కూడా అందుకోవచ్చని ఐఎండీ హెచ్చరించింది.
Also Read
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
ఏయే ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారంటే..
రానున్న కొన్ని గంటల్లో ఢిల్లీ పరిధిలోని బవానా, రాజౌరీ గార్డెన్, పటేల్ నగర్, సఫ్దర్‌జంగ్, లోధి రోడ్, బుద్ధ జయంతి పార్క్, రాష్ట్రపతి భవన్, రాజీవ్ చౌక్, ఐటీఓ (ITO), కల్కాజీ, తుగ్లకాబాద్ ప్రాంతాల్లో, అలాగే హర్యానా పరిధిలో రోహ్తక్, ఖర్ఖోదా, పల్వాల్ పరిసర ప్రాంతాల్లో భారీ తుఫాన్ గాలి, వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ అకస్మాత్తు వాతావరణ మార్పులతో ఢిల్లీలో ఎండల తీవ్రత తగ్గి, ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి.
#WATCH | Delhi witnesses a weather change as a dust storm sweeps across the Dwarka Sector 12 Metro station area. pic.twitter.com/5JyMlBsk6J
— ANI (@ANI) June 15, 2026
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!