NTV Telugu Site icon

Delhi Metro: హస్తిన వాసులకు అలర్ట్.. 26న ఉ.3 గంటల నుంచే మెట్రో సేవలు

Delhimetro

Delhimetro

రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న తెల్లవారుజామున ఉదయం 3 గంటలకే మెట్రో రైలు సేవలు ప్రారంభం అవుతాయని డీఆర్‌ఎంసీ పత్రికా ప్రకటనలో పేర్కొంది. గణతంత్ర దినోత్సవం వేడుకలు జరిగే కర్తవ్య పథ్ చేరుకోవడానికి ప్రజలకు వీలుగా జనవరి 26న తెల్లవారుజామున 3 గంటల నుంచి అన్ని మార్గాల్లో ఢిల్లీ మెట్రో సేవలను ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. ఉదయం 6 గంటల వరకు 30 నిమిషాల వ్యవధిలో రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. 6 తర్వాత మాత్రం యథావిధిగా సాధారణ టైమ్‌టేబుల్ ప్రకారం మెట్రో సేవలు ప్రారంభం అవుతాయని స్పష్టం చేసింది. ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని ఢిల్లీ మెట్రో తెలిపింది. వేడుకలకు హాజరయ్యే ప్రయాణీకులకు ప్రయాణం సులభతరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ మెట్రో తెలిపింది.

ఇది కూడా చదవండి: Baba Ramdev : వందల టన్నుల కారం పొడిని రిటర్న్ ఇవ్వమన్న బాబా రాందేవ్ కంపెనీ.. డబ్బులు వాపస్

2025 గణతంద్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోను ముఖ్యఅతిథిగా భారత్ ఆహ్వానించింది. ఇది భారత్-ఇండోనేషియా మద్య దౌత్య సంబంధాల విషయంలో ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.

ఇది కూడా చదవండి: HPCL Recruitment 2025: మళ్లీరాని ఛాన్స్.. HPCLలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ జాబ్స్.. నెలకు 1.2 లక్షల జీతం