దేశ రాజధాని ఢిల్లీలో దారణం జరిగింది. వర్షంలో ఆడుకోవడానికి పదేళ్ల కుమారుడు పట్టుబట్టడంతో కోపం తట్టుకోలేక తండ్రి ఘాతుకానికి తెగబడ్డాడు. చెప్పిన మాట వినలేదని కుమారుడిపై కత్తితో దాడి చేశాడు. దీంతో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: SSMB 29 : రోజుకో ఆట చూపిస్తున్న జక్కన్న..!
దినసరి కూలీ అయిన రాయ్(40) సాగర్‌పూర్ రియాలో నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం భార్య చనిపోయింది. మొత్తం నలుగురు సంతానం. నలుగురు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. నలుగురు బిడ్డల్లో మూడోవాడైన 10 పదేళ్ల బాలుడు శనివారం వర్షం పడుతుండగా ఆడుకునేందుకు బయటకు వెళ్లేందుకు పట్టుబట్టాడు. అందుకు తండ్రి అంగీకరించలేదు. అయినా కూడా కుమారుడు మారం చేశాడు. దీంతో కోపం తట్టుకోలేక వంటగదిలోకి వెళ్లి కత్తి తీసుకుని పిల్లవాడి పక్కటెముక వైపు పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావం అయింది. అనంతరం సమీపంలోని దాదా దేవ్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. బాలుడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
ఇది కూడా చదవండి: AN 63 : అల్లరి నరేష్ 63 టైటిల్ ‘ ఆల్కహాల్’..
సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బాలుడిని పరిశీలించి కత్తిపోట్లకు చనిపోయినట్లుగా నిర్ధారించారు. అనంతరం తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. వర్షంలో ఆడుకోవడానికి బాలుడు పట్టుబట్టడంతో కోపంలో తండ్రి కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు. సంబంధిత చట్టాల కింద తండ్రిపై హత్య కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నేరానికి ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక తండ్రి జైలుకెళ్లడంతో మిగతా ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.