Site icon NTV Telugu

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం.. హైద్రాబాద్ కు చెందిన ప్రవీణ్ కుమార్ పేరు

Delhi Liquor Scam

Delhi Liquor Scam

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో హైదరాబాద్‌ కు చెందిన ప్రవీణ్ కుమార్‌ పేరు తెరమీదకు వచ్చింది. హైదరాబాద్‌ కు చెందిన చార్డెడ్‌ అకౌంటెంట్‌ బుచ్చిబాబుకు ప్రవీణ్‌ సన్నిహితుడిగా ఉన్నాడు ఈడీ చార్జీషీట్‌ లో ప్రవీణ్‌ పేరు నమోదు చేసి.. ప్రవీణ్‌ కుమార్‌ పాత్రపై ఈడీ అధకారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక గతంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన సమయంలో ప్రవీన్‌ నివాసంలో ఈడీ అధికారులు రూ.24లక్షలు సీజ్‌ చేశారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో దుబాయ్‌ కంపెనీతో పాటు పై కంపెనీకి నిధులు మళ్లించారనే అభియోగాలపై ఈడీ విచారణ చేపట్టింది.

Read also: Pineapple Juice: పైనాపిల్ జ్యూస్‌తో లాభాలే కాదు.. నష్టాలు కూడా!

గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో ఈడీ, సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ పత్రాల ఆధారంగా విచారణ చేపట్టారు. ఈ కేసులో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురిని ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రవీణ్ పేరు తెరపైకి రావడంతో ఈ కేసులో మరికొందరి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం లేకపోలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంతో ప్రవీణ్‌కుమార్‌కు ఏ మేరకు సంబంధం ఉందనే దానిపై ఈడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు.

Read also: Love Affair: ఇద్దరి ప్రాణాలు బలితీసుకున్న ప్రేమ..

ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ నేతల హస్తం ఉందని బీజేపీ ఆరోపించింది. ఈ ఆరోపణలను బీఆర్‌ఎస్ నేతలు ఖండించారు. గతంలో ఈడీ అరెస్ట్ చేసిన దినేష్ అరోరా రిమాండ్ రిపోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు బయటకు వచ్చింది. దీంతో ఈ కేసులో సమాచారం కోసం సీబీఐ అధికారులు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సమాచారం తీసుకున్న విషయం తెలిసిందే.. సెక్షన్ 160 కింద నోటీసులు అందజేసి కమిటీ నుంచి సమాచారం సేకరించారు. అదే రోజు కవితకు సీబీఐ అధికారులు మరో నోటీసు ఇచ్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణంపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు విచారించారు. మనీష్ సిసోడియా నివాసం, కార్యాలయం, బ్యాంకుల్లోనూ సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు హైదరాబాద్‌ కు చెందిన ప్రవీణ్‌ పేరు తెరపై రావడంతో రాజకీయ నాయకుల్లో గుబులు నెలకొంది. ఎవరుపేర్లు బయటకు వస్తాయో అన్న విషయంపై ఉత్కంఠ నెలకుంది.
Pineapple Juice: పైనాపిల్ జ్యూస్‌తో లాభాలే కాదు.. నష్టాలు కూడా!

Exit mobile version