IRS Officer Daughter Murder: నిందితుడి నేర చరిత్ర తెలిసి షాకైన పోలీసులు.. బ్యాగ్రౌండ్ ఎంత ఘోరమంటే..!
- సంచలనంగా మారిన ఐఆర్ఎస్ అధికారి కుమార్తె హత్య కేసు
- గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
- నిందితుడి నేర చరిత్ర తెలిసి షాకైన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో ఐఆర్ఎస్ అధికారి కుమార్తె హత్య కేసులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు రాహుల్ మీనా (19) నేర చరిత్ర తెలిసి పోలీసులే షాక్‌కు గురవుతున్నారు. ఇంత చిన్న వయసులో ఇంత క్రూరత్వానికి ఎలా అలవాటు పడ్డాడో తెలిసి అవాక్కయ్యారు.
రాహుల్ మీనా..
రాహుల్ మీనా రాజస్థాన్‌లోని అల్వాల్ ప్రాంతం. ఇతగాడికి చదువు.. సంధ్య లేదు. జలాయి తనానికి అలవాటు పడ్డాడు. సులువుగా డబ్బులు ఎలా సంపాదించాలన్నదానిపై ధ్యాస పెట్టాడు. దీన్నే వృత్తిగా మార్చుకున్నాడు. దొంగతనాలతో మొబైల్ కొనుగొన్నాడు. దాంతో ఆన్లైన్ గేమ్‌కు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో అతగాడి జేబుల్లోకి డబ్బులు దండుగా రావడం మొదలయ్యాయి. మనీని అడ్డంపెట్టుకుని కొత్త అమ్మాయిలకు డబ్బులు ఎర వేసి అనుభవించడం మొదలు పెట్టాడు. అమ్మాయిలను అనుభవించడాన్ని రుచి మరిగాడు. ఇలా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఇప్పటి వరకు చాలా మంది అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.
Also Read
- Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
- Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
- Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
ఈ క్రమంలోనే స్నేహితుడి భార్యపై కూడా అత్యాచారం చేశాడు. ఆన్లైన్ గేమ్ ఆడేందుకు మాటిమాటికీ స్నేహితుడి ఇంటికి వస్తుండే వాడు. అయితే స్నేహితుడి ఇంట్లో లేని సమయంలో ఒంటరిగా ఉన్న మహిళపై దాడి చేసి లొంగదీసుకున్నాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించి అత్యాచారం చేశాడు. బాధితురాలి దేహంపై గాయాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.
ఈ ఘటన తర్వాత మొబైల్‌ను రూ.10, 000కు విక్రయించి.. రూ.6 వేలతో క్యాబ్ బుక్ చేసుకుని మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఢిల్లీకి చేరుకున్నాడు. అయితే నిందితుడు గతంలో ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో పని చేశాడు. కానీ మొదటి నుంచి కూడా రాహుల్ మీనా ప్రవర్తన తేడా గానే ఉంది. ఇరుగుపొరుగు పని వాళ్ల దగ్గర అప్పులు చేయడం.. వారికి తిరిగి ఇవ్వకపోవడంతో గొడవలు జరిగేవి. ఆ బాకీలను ఐఆర్ఎస్ అధికారి కూడా తీర్చాడు. అయితే ఇంట్లో ఉండే సమయంలో అన్ని విషయాలపై అవగాహన ఉంది. తాళాలు ఎక్కడుంటాయి. అధికారి ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్తాడన్న విషయాలు పూర్తిగా తెలుసు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం ఐఆర్ఎస్ అధికారి తన భార్యతో కలిసి జిమ్‌కు వెళ్లిపోయారు. ఈ విషయాన్ని నిందితుడు గమనించాడు.
అంతే అంతస్తు పైగదిలో చదువుకుంటున్న యువతి గదిలోకి నేరుగా వెళ్లిపోయాడు. తొలుత ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. ఈ క్రమంలోనే దీపం దగ్గర ఉన్న ఒక పెద్ద ఆయుధంతో తలపై మోదాడు. దీంతో ఆమె స్పృహ తప్పిపోయింది. వెంటనే ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం లాకర్లో వస్తువులు తీసుకుని వెళ్లిపోవాలని ప్లాన్ చేశాడు. దీంతో రక్తపు మడుగులో ఉన్న యువతిని లాకర్ దగ్గరకు తీసుకెళ్లాడు. రక్తం తుడిచి లాకర్‌పై ఆమె వేలు పెట్టాడు. కానీ ఓపెన్ కాలేదు. దీంతో ఆయుధం దాడి చేసి వస్తువులు దొంగిలించాడు. అయితే బట్టలు రక్తంతో తడవడంతో బాధితురాలి అన్నయ్య బట్టలు మార్చుకుని బయటకు వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇదంతా నిందితుడు గంటలోనే ముగించేశాడు.
ఇక ఒక క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో నిందితుడు రాహుల్ మీనాను ద్వారకా ప్రాంతంలోని ఓయో హోటల్లో అరెస్ట్ చేశారు. గత రాత్రి నుంచి విచారించగా నేర చరిత్ర తెలిసి పోలీసులే షాక్‌కు గురయ్యారు.
తాజావార్తలు
-
Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
-
Raima Islam Shimu: భర్తతో గొడవ నుంచి హత్య వరకు.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి నటి కేసు
-
Vivo X500 Series: సెప్టెంబర్‌లో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు.. 200MP కెమెరా, 4K 240fps వీడియోతో అదరగొట్టనున్న వివో!
-
IRUMUDI : టికెట్ల అమ్మకాల్లో పెద్దిని దాటిన ‘ఇరుముడి’
-
Shivalayam Movie: రంగస్థలం ఫేమ్ ఆచంట మహేష్ హీరోగా ‘శివాలయం’ మూవీ!
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..