కరోనా మహమ్మారీ మూడేళ్ల క్రితం మృత్యువు గంట మోగించింది.. లక్షల మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు.. నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో కొవిడ్-19 పిరోలా వేరియంట్ ప్రబలుతోంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూకేలతో సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో బీఏ 2.86 పిరోలా కొవిడ్ వేరియంట్ ప్రబలుతోంది.. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూ జనాలను ఆందోళన పెట్టిస్తున్నాయి..
చాలా మంది వ్యక్తులు కొవిడ్ ప్రోటోకాల్‌ను గమనించడం లేదు. ఇంట్లో కూడా తమను తాము పరీక్షించుకోవడం మానేశారు. దీంతో కొత్త కొవిడ్ వేరియంట్ వ్యాప్తి చెందే ప్రమాదాన్ని పెంచుతుందని సర్వే వెల్లడించింది. ఒమైక్రాన్ కు భిన్నంగా ఆల్ఫా, డెల్టా వేరియంట్ లకు దగ్గరి లక్షణాలున్న పిరోలా వేరియంట్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి.. ఈ వ్యాధి సోకిన వాళ్లు వాసనను, రుచిని కోల్పోతారు.. ఇక జ్వరం, ముక్కు కారటం, గొంతునొప్పి, తలనొప్పి, కీళ్లనొప్పులు, శరీర నొప్పి, శ్వాసకోశ సమస్యలు, వైరల్ ఫీవర్ లక్షణాలున్న రోగులు ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో 61 శాతం మంది ఉన్నారని సర్వేలో వెల్లడైంది.
అంతేకాదు జ్వరాలు సోకిన వారిలో 2 నుంచి 3శాతం మంది కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్నారు.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి.. దాంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.. ముఖ్యంగా వైరల్ ఫీవర్స్, కొవిడ్, స్వైన్ ఫ్లూ వంటి జ్వరాలతో రోగులు అల్లాడుతున్నారు. ఢిల్లీలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఢిల్లీ ప్రాంతంలో పిరోలా కొవిడ్ వేరియంట్ కేసులు ప్రబలుతుండటంతో మళ్లీ మాస్కులు ధరించడం మంచిదని, స్వీయ జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు..