IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
- మే 23 వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- రానున్న 5 రోజులు అత్యంత కీలకం
- ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IMD Yellow Alert: దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మే నెల మధ్యలోనే ఎండలు ముదిరిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) తాజాగా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీతో పాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ముంబై (మహారాష్ట్ర) సహా పలు రాష్ట్రాల్లో రానున్న 4 నుంచి 5 రోజుల పాటు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది.
ఢిల్లీలో 45 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు..
రాజధాని నగరంలో ఎండ తీవ్రత రికార్డు స్థాయికి చేరుతోంది. ఇప్పటికే ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. వేడి గాలులు, ఉక్కపోతతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే జంకుతున్నారు. రానున్న మే 23వ తేదీ వరకు ఢిల్లీలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, ఎండల తీవ్రత ఇలాగే కొనసాగుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read
- Assam Magic Rice: "మ్యాజిక్ బియ్యం".. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
- BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
- BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ..
తీవ్ర వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐఎండి ఇప్పటికే ఢిల్లీకి ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో ప్రజలు అనవసరంగా బయటకు రాకూడదని, వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. దేశ వ్యాప్తంగా వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున, ప్రజలందరూ ఎండ నుంచి రక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్య సమస్యలతో బాధపడే వారు ఈ ఐదు రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
-
High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
-
AP Collectors Conference: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్.. గంట ప్రిపరేషన్ కాదు, 2 నిమిషాల్లో క్లియర్ రిపోర్ట్!
-
Gold-Silver Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24K, 22K, 18K రేట్లు ఎంతంటే?
-
Assam Magic Rice: “మ్యాజిక్ బియ్యం”.. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!