Arvind Kejriwal: “ఎమ్మెల్యేల కొనుగోలు” ఆరోపణలపై ఢిల్లీ సీఎంకి క్రైమ్ బ్రాంచ్ నోటీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ నోటీసులు అందించింది. ఇటీవల కేజ్రీవాల్ మాట్లాడుతూ.. బీజేపీ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో క్రైమ్ బ్రాంచ్ యూనిట్ శుక్రవారం నేరుగా కేజ్రీవాల్ ఇంటికి వెళ్లింది. అయితే, క్రైమ్ బ్రాంచ్ అధికారులు నోటీసులు ఇవ్వకుండానే వెనుదిరిగినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తుందని కేజ్రీవాల్ ఆరోపణలపై విచారణ జరిపించాలని బీజేపీ నాయకులు పోలీస్ కమిషనర్ని కలిసిన తర్వాత క్రైం బ్రాంచ్ ఈ చర్య తీసుకుంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)తో విచారణ జరిపించాలని బిజెపి ప్రతినిధి బృందం కోరింది.
Read Also: Indian Navy: సముద్ర దొంగల బారి నుంచి పాక్, ఇరాన్ సిబ్బందిని కాపాడిన ఇండియన్ నేవీ..
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
గత వారం ఢిల్లీ మంత్రి అతిషి.. ఆప్‌కి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలకు పార్టీ వీడేందుకు ఒక్కొక్కరికి రూ.25 కోట్లను బీజేజీ ఆఫర్ చేసిందని, కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొడతామని బెదిరించిందని ఆరోపించారు. పార్టీ ఎమ్మెల్యేల్లో ఒకరిని సంప్రదించిన రికార్డింగ్ అందుబాటులో ఉందని, తర్వాత చూపిస్తామని ఆమె చెప్పారు. ఎన్నికల్లో గెలవలేకనే బీజేపీ ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సిద్ధమైందని ఆరోపించింది.
దీనిపై కేజ్రీవాల్ ఎక్స్‌లో స్పందించారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించిందని, తనను త్వరలో అరెస్ట్ చేయవచ్చని, ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టిన తర్వాత ఏడుగురు ఎమ్మెల్యేలకు రూ. 25 కోట్ల చొప్పున ఇస్తామని, బీజేపీ తరుపున టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు, అయితే వారు పార్టీని వీడేందుకు నిరాకరించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. అయితే ఢిల్లీ బీజేపీ ఈ ఆరోపణల్ని కొట్టేసింది. ఎమ్మెల్యేల పేర్లు చెప్పాలని డిమాండ్ చేసింది. మద్యం కుంభకోణంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఆప్ ఇలాంటి ఆరోపణలు చేస్తుందని బీజేపీ ఆరోపించింది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..