Site icon NTV Telugu

Boondi Laddoo: “బూందీ లడ్డూ”తో పరారీలో ఉన్న హత్య దోషి అరెస్ట్..

Crime

Crime

Boondi Laddoo: నాలుగేళ్లుగా తప్పించుకుతిరుగుతున్న ఓ హత్య కేసులో దోషిని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్‌తో అరెస్ట్ చేశారు. రిపబ్లిక్ డే రోజున ‘‘ బూందీ లడ్డూ’’ ని పంచుతూ అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పెరోల్ పొందిన తర్వాత అప్పటి నుంచి దోషి పరారీలో ఉన్నాడు. 2008లో ఢిల్లీలోని నజాఫ్‌గఢ్ ప్రాంతంలో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యని హత్య చేసిన కైలాష్(40) అనే వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

Read Also: Wife harassment: భార్య వేధింపులకు మరో భర్త బలి.. ‘‘వరకట్న చట్టాలను మార్చాలంటూ..’’

హత్య నేరం కింద దోషిగా తేలిని కైలాష్ 2011లో 3 నెలల పెరోల్ కింద విడుదలయ్యాడు. అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా పారిపోతున్నాడు. మంగళవారం మధ్యప్రదేశ్‌లోని శివపురిలో అరెస్ట్ చేశారు. కోవిడ్ మహమ్మారి సమయంలో 3 నెలల పెరోల్ తర్వాత లొంగిపోకుండా 2021 నుంచి పరారీలో ఉన్నట్లు ఏసీపీ క్రైమ్ బ్రాంచ్ సంజయ్ కుమార్ సైన్ తెలిపారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మకాం మార్చాడు.

మొదట్లో ఢిల్లీలోని లక్ష్మీ నగర్‌లో నివసించేవాడు. ఆ తర్వాత రెండేళ్లు హరిద్వార్‌కి మకాం మార్చాడు. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని సొంత ఊరు వచ్చి రోజూవారీ కూలీగా పనిచేస్తున్నట్లు అధికారులకు సమాచారం వచ్చింది. అయితే, ఎలాంటి అనుమానం వచ్చినా మళ్లీ పారిపోతాడని తెలిసి, అధికారులు గణతంత్ర దినోత్సవం రోజు గ్రామస్తులతో కలిసి ‘‘బూందీ లడ్డూలు’’ పంపిణీ చేశారు. అదే సమయంలో తెలివిగా కైలాష్‌ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైలు అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version