Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Delhi Crime 15 Year Old Boy Beaten To Death Over Cricket Dispute In Tilak Nagar

Cricket Match Dispute: క్రికెట్‌ మ్యాచ్‌లో గొడవ.. 15 ఏళ్ల ఆటగాడిని చంపేశారు..

Published Date :February 24, 2026 , 9:58 pm
By Sudhakar Ravula
Cricket Match Dispute: క్రికెట్‌ మ్యాచ్‌లో గొడవ.. 15 ఏళ్ల ఆటగాడిని చంపేశారు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Cricket Match Dispute: ఢిల్లీలో ఆటస్థలం రణరంగంగా మారింది. క్రికెట్ ఆడుతున్న సమయంలో తలెత్తిన చిన్నపాటి వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తిలక్ నగర్ జిల్లాలోని వుడ్‌ల్యాండ్ పార్క్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. అసలేం జరిగిందంటే.. ఫిబ్రవరి 23, రాత్రి 7:22 గంటల సమయంలో తిలక్ నగర్‌లోని వుడ్‌ల్యాండ్ పార్క్‌లో కొందరు బాలురు క్రికెట్ ఆడుతున్నారు. ఈ క్రమంలో 12 ఏళ్ల బాలుడికి, 15 ఏళ్ల మరో బాలుడికి మధ్య మాటా మాటా పెరిగి గొడవ మొదలైంది. తొలుత సాధారణ వాగ్వాదంగా ప్రారంభమైన ఈ వివాదం.. చివరికి ప్రాణాంతక దాడిగా మారింది.

అయితే, తొలి గొడవ తర్వాత, 12 ఏళ్ల బాలుడు ఇంటికి వెళ్లి తన బంధువులైన మరో ఇద్దరు మైనర్లకు (17, 13 ఏళ్లు) జరిగిన విషయం చెప్పాడు. ఆగ్రహంతో ముగ్గురూ కలిసి 15 ఏళ్ల బాలుడి కోసం పార్క్ ప్రాంతంలో వెతికారు. బాధితుడు కనిపించగానే ముగ్గురు కలిసి అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దాడి సమయంలో బాధితుడి మెడ, తలపై తీవ్రమైన గాయాలయ్యాయి. దెబ్బల ధాటికి అతను అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు మరియు కుటుంబ సభ్యులు అతన్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై తిలక్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితులైన ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.

ఇక, జువెనైల్ జస్టిస్ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు పోలీసులు.. మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుసుకోవడానికి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపారు. అయితే, మృతుడు ఒక టీ వ్యాపారి కుమారుడు. నలుగురు సోదరులలో మూడవవాడైన ఈ బాలుడు ఇలా అకాల మరణం చెందడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Cricket Fight Death
  • Cricket Match Dispute.
  • Delhi Police Arrest Minors
  • Delhi Tilak Nagar Murder
  • Minor Boy Killed Delhi

తాజావార్తలు

  • RCB vs MI: సాల్ట్ ‘పవర్’.. పాటిదార్ ‘స్పీడ్’.. కోహ్లీ ‘క్లాస్’.. వాంఖడేలో ఆర్‌సీబీ విధ్వంసం!

  • Moringa Powder: జిమ్‌కి వెళ్లక్కర్లేదు.. రోజుకు రెండు ముద్దల ఈ పొడి తింటే కొవ్వు కరగాల్సిందే!

  • US-Iran War: పాకిస్తాన్ తర్వాత సీన్‌లోకి రష్యా.. మధ్యవర్తిత్వానికి పుతిన్ సిద్ధం..

  • Axis Bank : నమ్మితే నట్టేట ముంచాడు.. NRI ఖాతా నుంచి రూ. 7 కోట్లు కొట్టేసిన బ్యాంక్ మేనేజర్.!

  • Chanakya Niti: మీ మాటకు విలువ పెరగాలంటే ఏం చేయాలి? ఆచార్య చాణక్యుడు చెప్పిన బెస్ట్ టిప్స్ ఇవే..

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions