NTV Telugu Site icon

Delhi Air Pollution: ఢిల్లీలోకి యాప్- ఆధారిత ట్యాక్సీలపై నిషేధం..

Delhi Air Pollution

Delhi Air Pollution

Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని అదుపు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. నిన్న ఏయిర్ పొల్యూషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కాలుష్యంపై హర్యానా, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. పంట వ్యర్థాల కాల్చివేతను ఎలాగైనా అడ్డుకోవాల్సిందే అని నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. దీంతో పాటే ఢిల్లీలో యాప్ బేస్డ్ క్యాబులపై నిషేధం విధించాలని ఆప్ ప్రభుత్వానికి సూచించింది.

సుప్రీంకోర్టు సూచనల మేరకు ఈ రోజు ఢిల్లీ రవాణా మంత్రి గోపాల్ రాయ్ అధికారులతో సమావేశమయ్యారు. ఇతర రాష్ట్రాల యాప్ ఆధారిత క్యాబ్‌లను ఢిల్లీలోకి నిషేధించారు. నిన్నటి విచారణలో సుప్రీంకోర్టు.. ఢిల్లీలో వివిధ రాష్ట్రాలకు రిజిస్ట్రేషన్లు కలిగిన యాప్ ఆధారిత ట్యాక్సీలు పెద్ద సంఖ్యలో ఉన్నాయని గుర్తించామని, ఒక్కొక్క ప్రయాణికుడు ఒక్కో క్యాబ్ లో వెల్లడాన్ని ప్రశ్నించింది. కాలుష్యాన్ని అదుపు చేయడానికి క్యాబ్‌లపై చర్యలు తీసుకోవాలని సూచించింది.

Read Also: Mukesh Ambani: ముకేష్ అంబానీ అంటే మామూలుగా ఉండదు.. భార్యకు రూ. 10 కోట్ల కార్ గిఫ్ట్..

ఢిల్లీ ప్రభుత్వం నగరంలో సరి-బేసి విధానంలో వాహనాల రాకపోకలను నిర్వహిస్తున్నామని సుప్రీంకోర్టుకు తెలిపింది. గత సంవత్సరం ఈ విధానం ఎలా పనిచేసిందో విశ్లేషించారా.? అని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కోర్టు సమీక్ష తర్వాత ఈ విధానాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

ప్రతీ ఏడాది శీతాకాలంలో ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థితికి చేరుకుంటుంది. పంజాబ్, యూపీ, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను కాల్చివేయడంతో ఈ సమస్య తీవ్రత పెరుగుతోంది. నిన్నటి సుప్రీంకోర్టు విచారణలో ఢిల్లీలో, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా ఆప్ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాదా.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది.