Delhi Assembly Election 2025: రేపే ఢిల్లీ అసెంబ్లీ పోలింగ్.. ఏర్పాట్లు పూర్తి
- రేపే ఢిల్లీ అసెంబ్లీ పోలింగ్.. ఏర్పాట్లు పూర్తి
- పోలింగ్‌లో పాల్గొననున్న 1.56 కోట్ల మంది ఓటర్లు
- ఉ.7 గంటల నుంచి సా.6 గంటల వరకు పోలింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్‌లో 1.56 కోట్ల మంది ఢిల్లీ ఎన్నికల్లో ఓటేయనున్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. సాయంత్రం 6:30 వరకు ఎగ్జిట్ పోల్స్ నిషేధించింది. అనంతరం ఏ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందో ఎగ్జిట్ పోల్స్ తేల్చనున్నాయి.
ఇది కూడా చదవండి: Maha Kumbh Mela: కుంభమేళాకి భూటాన్ రాజు… సంగమంలో పుణ్యస్నానం..
Also Read
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 58 జనరల్, 12 ఎస్సీ రిజర్వ్ సీట్లు ఉన్నాయి. 83.49 లక్షల మంది పురుషులు.. 71.74 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక 20 నుంచి 29 ఏళ్ల వయసు ఉన్న యువ ఓటర్ల సంఖ్య 25.89 లక్షలు కాగా… ఇక 2.08 లక్షల మంది ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయనున్నారు. వికలాంగులు 79,430 మంది ఓటర్లు ఉండగా.. 100 ఏళ్లు దాటిన ఓటర్ల సంఖ్య 830.. 85 ఏళ్ల వయసు దాటిన ఓటర్ల సంఖ్య 1.09 లక్షలుగా ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు. మరోవైపు ఢిల్లీలో ట్రాన్స్‌జెండర్ ఓటర్ల సంఖ్య 1261 ఉన్నారు.
ఇది కూడా చదవండి: Legislative Council : కులగణన లెక్కలపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉంది
అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. మరోసారి అధికారం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తుండగా.. ఈ సారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ఆరాటపడుతోంది. అలాగే కాంగ్రెస్ కూడా గట్టిగానే ప్రచారం నిర్వహించింది. రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీ ఉచిత పథకాలను ప్రకటించాయి. ఎవరికి వారే పోటాపోటీగా హామీలు గుప్పించారు. కానీ హస్తిన వాసులు ఎవరికీ అధికారం కట్టబెడతారో చూడాలి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక స్థానాలు
న్యూఢిల్లీ నియోజకవర్గం
ఆప్ – అరవింద్ కేజ్రీవాల్
బీజేపీ – పర్వేష్ వర్మ
కాంగ్రెస్ – సందీప్ దీక్షిత్
కల్కాజీ నియోజకవర్గం
ఆప్ – అతిషీ
బీజేపీ – రమేష్ బిధూరీ
కాంగ్రెస్ – అల్కా లంబా
జంగ్‌పురా నియోజకవర్గం
ఆప్ – మనీష్ సిసోడియా
బీజేపీ – సర్దార్ తర్వీందర్ సింగ్ మార్వా
కాంగ్రెస్ – ఫర్హాద్ సురి
ప్రతాప్గంజ్ నియోజకవర్గం
ఆప్ – అవధ్ ఓజా
బీజేపీ – రవిందర్ సింగ్ నేగి
కాంగ్రెస్ – అనిల్ చౌదరీ
తాజావార్తలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!