Delhi-AAP: ఢిల్లీ ఆక్రమణల కూల్చివేత… రేపు ఎమ్మెల్యేలతో సీఎం కేజ్రీవాల్ సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్. బుల్డోజర్లలో ఆక్రమణలను కూల్చివేస్తున్నారు. ఈ బుల్డోజర్ కూల్చివేతల వివాదం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కొన్ని ఢిల్లీలోని కొన్ని ఏరియాల్లో కూల్చివేతలకు వ్యతిరేఖంగా స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు తీవ్ర ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అధికార ఆప్, కాంగ్రెస్, వామపక్షాల నాయకులు ఎంతగా వ్యతిరేఖించినా ఢిల్లీ మున్సిపల్ అధికారులు తగ్గడం లేదు. పోలీసులు, సీఆర్ఫీఎఫ్ భద్రత నడుమ ఆక్రమణలను కూల్చివేస్తున్నారు.
ఇటీవల ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీ, షాహీన్ బాగ్ ఏరియాల్లో కూల్చివేతలపై తీవ్ర ఆందోళనలు జరిగాయి. ఇదిలా ఉంటే గురువారం మదన్ పూర్ ఖాదర్ కళ్యాణ్ నగర్ కూల్చివేతల సమయంలో ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ వ్యతిరేఖంగా ఆందోళన చేశారు. క్రమంలో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ఆయనపై హిస్టరీ షీట్ బుక్ చేశారు. మొత్తం 18 ఎఫ్ఐఆర్లు బుక్ చేశారు. తాజాా ఈరోజు శ్యాంపూర్ ఏరియాల్లో ఆక్రమణలను కూల్చివేశారు.
Also Read
- Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
- LPU Students Protest: LPUలో స్టూడెంట్స్ రచ్చ.. రేప్ ఆరోపణలతో వర్సిటీలో విధ్వంసం..
- Congress: మోడీ గెలిచిన వారణాసిలో రీపోలింగ్ నిర్వహించాలి.. యూపీ కాంగ్రెస్ చీఫ్ డిమాండ్..
- CJP: కాక్రోచ్ పార్టీకి హిమంత మామ ట్రీట్మెంట్.. రాంకా అరెస్ట్, అభిజత్ దీప్కే ఆగ్రహం..
ఇదిలా ఉండే ఢిల్లీ నగర వ్యాప్తంగా కూల్చివేతలపై సీఎం కేజ్రీవాల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆప్ ఎమ్మెల్యేలు అందరూ మీటింగ్ కు రావాల్సిందిగా శుక్రవారం ఆదేశించారు. ఆప్ ఎమ్మెల్యే అమనుతుల్లా ఖాన్ ను అరెస్ట్ చేసిన ఒక రోజు తర్వాత సీఎం కేజ్రీవాల్ ఈ సమావేశానికి పిలుపునిచ్చారు.
మరోవైపు బుల్డోజర్ల చర్యపై, ఢిల్లీలో ఆక్రమణల కూల్చివేత విధ్వంసాన్ని ఆపాలంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. బీజేపీ బుల్డోజర్ రాజకీయాలను ఖండించారు. కాగా.. హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా జహంగీర్ పురిలోని ఓ వర్గం వారు శోభాయాత్రపై రాళ్లు రువ్వడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఆందోళనకారులు అక్రమ నిర్మాణాలపై నుంచి రాళ్లు రువ్వినట్లు అధికారులు గుర్తించడంతో రాజధానిలో బుల్డోజర్ల యాక్షన్ ప్రారంభం అయింది.
తాజావార్తలు
-
Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
-
CM Revanth Reddy : శ్వేతపత్రం విడుదల చేశాకే సిరిసిల్లలో అడుగుపెట్టాలి
-
LPU Students Protest: LPUలో స్టూడెంట్స్ రచ్చ.. రేప్ ఆరోపణలతో వర్సిటీలో విధ్వంసం..
-
Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
-
‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?