Site icon NTV Telugu

PM Modi Rajnath Singh: కాసేపట్లో ప్రధాని మోడీతో రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ..

Rajnath

Rajnath

PM Modi Rajnath Singh: జాతీయ భద్రతపై సీడీఎస్, త్రివిధ ద‌ళాధిప‌తులతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇవాళ కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రక్షణ కార్యకలాపాలు, భద్రతాదళాల కదలికలకు సంబంధించి ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేయాలని మీడియా, డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌లకు రక్షణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కార్గిల్‌ యుద్ధం, 26/11 ముంబై దాడులు, కాందహార్‌ హైజాక్‌ లాంటి గత సంఘటనలను పరిగణలోకి తీసుకుని.. సున్నితమైన సమాచారాన్ని బహిర్గతంతో రక్షణ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పాడుతుందని పేర్కొనింది.

Read Also: Pakistan: ‘‘మా ప్రధాని పిరికివాడు, మోడీ అంటే వణుకు’’.. షహబాజ్ షరీఫ్‌పై సొంత ఎంపీల ఆగ్రహం..

ఇక, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్ ఉపేంద్ర ద్వివేది, వైమానిక చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ దినేష్‌ కె. త్రిపాఠి, రక్షణ కార్యదర్శి రాజేష్‌ కుమార్‌ సింగ్‌లు ఈ భేటీలో పాల్గొన్నారు. పశ్చిమ సరిహద్దులో భద్రతా పరిస్థితి, భారత సాయుధ దళాల కార్యాచరణ గురించి రాజ్‌నాథ్‌సింగ్‌ సమీక్షించినట్లు టాక్. రక్షణ మంత్రిత్వ శాఖ భారత్‌ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంతో పాటు దేశ ప్రజల భద్రతకు పూర్తిగా సిద్ధంగా ఉందని రక్షణ శాఖ ప్రతినిధి చెప్పుకొచ్చారు.

Read Also: Rashmika : ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిందే.. ఆర్మీకి రష్మిక మద్దతు

అయితే, కాసేపట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ నిర్వహించిన సమావేశంలో సీడీఎస్, త్రివిధ ద‌ళాధిప‌తులతో తాజాగా చర్చించిన అంశాలను ప్రధాని మోడీ దృష్టికి రాజ్నాథ్ తీసుకెళ్లనున్నారు. కాగా, పాక్ దాడులను తిప్పికొట్టిన తీరును రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు త్రివిధ ద‌ళాధిప‌తులు వివరించారు.

Exit mobile version