NTV Telugu Site icon

Rajnath Singh: దేశ ఐక్యతకు రాజ్యాంగం ఓ రోడ్‌మ్యాప్‌లాంటిది..

Rajnath

Rajnath

Rajnath Singh: భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా పార్లమెంట్ లో రెండు రోజుల పాటు ప్రత్యేక చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగా లోక్‌సభలో ఈరోజు ఉదయం జీరో అవర్‌ ముగిసిన అనంతరం రాజ్యాంగంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని ఐక్యంగా, ప్రజాస్వామ్యంగా ఉంచేందుకు రాజ్యాంగం ఓ రోడ్‌మ్యాప్‌గా ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి నైతిక దిక్సూచి లాంటిదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి పేర్కొన్నారు.

Read Also: Tollywood Rewind 2024 : ఈ ఏడాది బెస్ట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే

కాగా, రాజ్యాంగం ప్రతి వ్యక్తికి గుర్తింపును అందిస్తుందని రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పుకొచ్చారు. అయితే, ప్రతిపక్షాలు అనేక సందర్భాల్లో రాజ్యాంగాన్ని అవమానించాయని ఆరోపించారు. కానీ, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ముఖ్యమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని అనేక పథకాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రేపటి వరకూ ఈ చర్చ జరుగుతుంది.. సభ్యులు దీనిపై సుదీర్ఘంగా చర్చ కొనసాగించనున్నారు. ఇక, ఈ చర్చకు ముగింపుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు సమాధానం ఇస్తారు.

Show comments