CV Anand Resign: బెంగాల్ ఎన్నికలకు ముందు షాకింగ్.. గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ రాజీనామా
- బెంగాల్ ఎన్నికలకు ముందు అనూహ్యంగా గవర్నర్ రాజీనామా
- రాజీనామా వెనుక రాజకీయ కారణాలపై చర్చ
- స్పందించిన మమతా బెనర్జీ
- కొత్త గవర్నర్‌గా R. N. రవి నియామకంపై ఊహాగానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ తన పదవికి రాజీనామా చేశారు. ఈరోజు (మార్చి 5, 2026) ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపినట్లు లోక్ భవన్ వర్గాలు ధృవీకరించాయి. సుమారు మూడున్నరేళ్ల పాటు బెంగాల్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన బోస్, అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది వారాల ముందే తప్పుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
రాజీనామా సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆనంద బోస్, “నేను గవర్నర్ కార్యాలయంలో తగినంత సమయం గడిపాను, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను” అని సమాధానమిచ్చారు. అయితే, ఆయన సడన్ రాజీనామా వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ వ్యవహారంపై స్పందిస్తూ, “రాజీనామా వార్త వినగానే నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం నుండి ఆయనపై ఏదైనా ఒత్తిడి వచ్చిందేమోనని నేను భావిస్తున్నాను” అని వ్యాఖ్యానించారు.
Also Read
- Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
ఆనంద బోస్ రాజీనామాతో ఖాళీ అయిన బెంగాల్ గవర్నర్ పదవిలో ప్రస్తుతం తమిళనాడు గవర్నర్‌గా ఉన్న ఆర్.ఎన్. రవిని నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనకు సమాచారం ఇచ్చారని మమతా బెనర్జీ పేర్కొన్నారు. అయితే, గవర్నర్ నియామక విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపలేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఆర్.ఎన్. రవికి కూడా తమిళనాడులో డిఎంకె ప్రభుత్వంతో విభేదాలు ఉన్న నేపథ్యంలో, బెంగాల్‌లో ఆయన నియామకం జరిగితే మమతా ప్రభుత్వంతో సంబంధాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.
Sanju Samson: లైవ్ ఇంటర్వ్యూలో ఏడ్చేసిన సంజు శాంసన్ తండ్రి! కారణం ఇదే..
తాజావార్తలు
-
Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
-
Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!