Customs Officers Seized Worth 2 Crores Gold In Varanasi Airport: విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలించేందుకు స్మగ్లర్లు పన్నుతున్న వ్యూహాలు అన్నీ ఇన్నీ కావు. కడుపులో బంగారం బిస్కెట్లు దాచుకోవడం, లేదా అధికారులు గుర్తించలేకుండా ఇతర మార్గాల్ని అనుసరించడం లాంటివి చేస్తుంటారు. కానీ ఏం లాభం, అడ్డంగా దొరికిపోతుంటారు. వారణాసి విమానాశ్రయంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది.
ఓ వ్యక్తి భారీగా బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించగా.. అధికారులు గుర్తించి, అడ్డంగా పట్టుకున్నారు. షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడు.. రూ. 1.22 కోట్లు విలువ చేసే 2.33 కేజీల బంగారం బిస్కెట్‌లను నల్లటి టేప్‌లో ప్యాక్ చేసి, నడుముకు బెల్టుగా వేసుకున్నాడు. దాన్ని ఎవరూ గుర్తించని అతడు భ్రమపడ్డాడు. కానీ, అధికారులకి దొరికిపోయాడు. అతడ్ని పూర్తిగా పరిశీలించగా, బెల్టులో బంగారం ఉందన్న విషయాన్ని పసిగట్టారు. దాంతో.. బెల్టు తీసి, అందులో ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఇటు శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనూ కస్టమ్స్ అధికారులు రెండు కేసులు నమోదు చేశారు. AI-952 విమానంలో వచ్చిన ప్రయాణికుడి వద్ద నుంచి 740 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఈ స్మగ్లర్.. బంగారాన్ని జూసర్‌లోని రోలర్, ఎడ్జస్ వ్యాన్‌కు అమర్చుకుని తరలించేందుకు ప్రయత్నించాడు. కానీ, టాస్క్‌ఫోర్స్ అధికారులకి దొరికిపోయాడు. అలాగే.. EK-526 విమానంలో వచ్చిన ప్రయాణికుని వద్ద నుంచి 3591 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇతడు పురుషనాళంలో బంగారం పెట్టుకొని తరలించేందుకు యత్నించాడు.