CRPF: “భయపడొద్దు, నేను చూసుకుంటా”.. జవాన్లకు CRPF చీఫ్ కీలక సందేశం..
- సీఆర్పీఎఫ్ సిబ్బందికి డీజీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ కీలక సందేశం.
- విధి నిర్వహణలో తీసుకునే నిర్ణయాలకు తానే బాధ్యత వహిస్తానని హామీ.
- "భయపడకుండా విధులు నిర్వర్తించండి" అంటూ జవాన్లకు పిలుపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CRPF: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) డైరెక్టర్ జనరల్(డీజీ) జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ కీలక తన సిబ్బందికి కీలక సందేశం ఇచ్చారు. విధి నిర్వహణలో నిజాయితీతో తీసుకునే ప్రతీ నిర్ణయానికి తాను పూర్తిగా బాధ్యత వహిస్తానని, ఎలాంటి భయం లేకుండా విధులు నిర్వర్తించాలని సిబ్బందికి పిలుపునిచ్చారు. సీఆర్పీఎఫ్ ఇన్వెస్టిచర్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. జనరల్ బెటాలియన్ అయినా, లా అండ్ ఆర్డర్ అయినా విధి నిర్వహణలో మీరు తీసుకునే ప్రతీ నిర్ణయం, ప్రతి చర్యకు డైరెక్టర్ జనరల్‌గా నేనే బాధ్యత వహిస్తాను. ఎలాంటి భయం లేకుండా మీ విధులను కొనసాగించండి’’ అని అన్నారు. ఇటీవల నీట్ పేపర్ లీక్ నిరసనల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్(ఆర్ఏఎఫ్) చేపట్టిన చర్యలపై సమీక్ష నిర్వహిస్తామని కూడా ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా అల్లర్లు, నిరసనలు జరుగుతున్న ఈ సమయంలో సీఆర్ఫీఎఫ్ డీజీ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం ఆసక్తికరంగా మారింది.
ఆర్ఏఎఫ్ సీఆర్పీఎఫ్లో భాగంగా పనిచేస్తూ అల్లర్ల నియంత్రణ,శాంతిభద్రతల పరిరక్షణలో ప్రత్యేక శిక్షణ కలిగిన దళంగా ఉంది. సీఆర్పీఎఫ్, రాష్ట్ర పోలీసులతో సమన్వయం చేసుకుంటూ వివిధ విధుల్ని నిర్వర్తిస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటు గ్రూపుల అణచివేతలో, దేశంలోని మిగతా ప్రాంతాల్లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు చేపడుతోంది. సీఆర్పీఎఫ్ కోబ్రా కమాండో గెరిల్లా, అటవి యుద్ధ తంత్రాల్లో ప్రత్యేక నైపుణ్యాన్ని కలిగి ఉంది. 2024 నవంబర్‌లో మణిపూర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో 10 మంది అనుమానిత కుకీ ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఘటనలో కూడా సీఆర్పీఎఫ్ కీలక పాత్ర పోషించింది.
Also Read
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి గో-అరౌండ్.. రెండో ప్రయత్నంలో సేఫ్ ల్యాండింగ్!
- Supreme Court: టెట్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ అర్హతలు తప్పనిసరి!
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!