Sitaram Yechury: ఢిల్లీ ఎయిమ్స్‌లో వెంటిలేషన్ పై సీతారాం ఏచూరి.. పరిస్థితి విషమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sitaram Yechury: సీపీఐ(ఎం) సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయనను ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు గురువారం రాత్రి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఏచూరి సీతారాంకు 72 ఏళ్లు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన ఆగస్టు 19న ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఎమర్జెన్సీ వార్డులో చేరారు. ఆ తర్వాత ఆరోగ్యం విషమించడంతో ఐసీయూకి తరలించాల్సి వచ్చింది. ప్రత్యేక వైద్యుల బృందం ఆయన పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అతను న్యుమోనియా లాంటి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు సమాచారం. అయితే చికిత్సకు సంబంధించిన వివరాలను ఆస్పత్రి వర్గాలు వెల్లడించలేదు. మరోవైపు ఇటీవల కంటికి శస్త్ర చికిత్స కూడా చేశారు.
Read Also:Paralympics 2024 India: పారాలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్ ఇదే!
Also Read
సీపీఐ పార్టీ అధికారిక ప్రకటన
సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితిపై ఆగస్టు 31న సీపీఐ(ఎం) పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. అతను శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నాడు. ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో ఉన్నారు ”అని ప్రకటన తెలిపింది.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్‌కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!