Site icon NTV Telugu

CPI Raja: ఆర్ఎస్ఎస్, బీజేపీ కలిసి.. దేశ సంక్షేమానికి తూట్లు పొడుస్తున్నాయి

Cpi Raja On Bjp Rss

Cpi Raja On Bjp Rss

CPI D Raja Sensational Comments On BJP and RSS: సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ. రాజా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ కలిసి దేశ సంక్షేమానికి తూట్లు పొడుస్తున్నాయని ఆరోపించారు. గవర్నర్ ఆఫీస్‌లను వినియోగించి.. తమ అజెండాను అమలు చేసేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ, పుదుచ్చేరిలో అదే జరుగుతోందన్నారు. ఆ రాష్ట్రాల్లోని గవర్నర్‌లు నామినేట్ చేసిన వ్యక్తులని.. గవర్నర్ విధానాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌పై చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరగాలన్నది ఆర్ఎస్ఎస్ విధానమని.. ఈ రెండు ఎన్నికల్ని ఒకేసారి జరపడంపై జాతీయ లా కమీషన్ తమ అభిప్రాయం కోరిందని.. ఇది కచ్ఛితంగా సాధ్యం కాని విధామని తేల్చి చెప్పారు.

Chintamaneni Prabhakar: నా చొక్కా చింపేసిన పోలీసులకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా..!!

మనది మల్టీ పార్టీ విధానమని, రాజ్యాంగ ప్రకారం ప్రభుత్వం రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ కావాలని ఉందని డీ. రాజా పేర్కొన్నారు. అయితే.. మోడీ ప్రభుత్వం రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ కాదని కుండబద్దలు కొట్టారు. ఇదే సమయంలో నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా ఆయన స్పందించారు. ఇది ఏకపక్షంగా ఇచ్చిన తీర్పు కాదని, భిన్నాభిప్రాయాలతో కూడిన జడ్జిమెంట్ అని అభిప్రాయపడ్డారు. అత్యుత్తమ రాజ్యాంగ సంస్థ అయిన పార్లమెంట్‌లో కూడా దీనిపై సంప్రదించలేదని మండిపడ్డారు. నోట్ల రద్దుకు మోడీ చెప్పిన ఏ ఒక్క రీజన్ సరిగ్గా అమలు కాలేదన్నారు. ఉగ్రవాదులకు నిధులు, అవినీతి, తదితర అంశాలేవీ అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోట్ల రద్దు పేదవారిపై తీవ్ర ప్రభావం చూపిందని.. ఆ టైంలో పేదవాళ్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారని ఉద్ఘాటించారు.

Big Breaking….Drugs Case: డ్రగ్స్ స్మగ్లర్ ఎడ్విన్ కేసులో ఇద్దరు అరెస్ట్

అంతకుముందు కూడా డీ. రాజా బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2024లో బీజేపీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే దేశం వినాశ‌న‌మ‌వుతుంద‌ని బాంబ్ పేల్చారు. తొలిసారి ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టినప్పుడు కనిష్ఠ ప్రభుత్వం, గరిష్ఠ పరిపాలన అందిస్తానని హామీ ఇచ్చారని.. కానీ అందుకు భిన్నంగా మోడీ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తూ, నిరంకుశ విధానాలను అమలు పరుస్తున్నారని విమర్శించారు. దేశాన్ని వినాశనం దిశగా మోడీ తీసుకుపోతున్నారని మండిపడ్డారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకిక వ్యవస్థలను పరిరక్షించుకోవాలంటే.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలయికను 2024 ఎన్నికల్లో తప్పక ఓడించాలని పిలుపునిచ్చారు.

Exit mobile version