Site icon NTV Telugu

Congress: ఎంపీలో మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు.. కోవిడ్ లాక్‌డౌన్ ఆలస్యం చేశారు..

Jairam Ramesh

Jairam Ramesh

Congress: కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కోవిడ్ మహమ్మారి లాక్‌డౌన్‌ని ఆలస్యం చేశారని బీజేపీై ఆరోపణలు గుప్పించారు. జ్యోతిరాదిత్య సింధియా వర్గం ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో 2020లో మధ్యప్రదేశ్‌లో కమల్ నాథ్ ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత సీఎం శివరాజ్‌సింగ్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.

2020, మార్చి కోవిడ్-19 మహమ్మారి మూలంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. అయితే సరైన సమయంలో కేంద్రంలోని బీజేపీ లాక్ డౌన్ విధించలేదని, మధ్యప్రదేశ్‌లో తమ ప్రభుత్వం పడిపోతుందని నిర్ధారించడానికి 10 రోజలు సమయం ఇచ్చారని, ఇది కుట్రని జైరాం రమేష్ ఆరోపించారు.

Read Also: Haryana: ప్రిన్సిపాల్ కాదు కీచకుడు..50 మంది బాలికలపై లైంగిక వేధింపులు..

ఎంపీలో బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని, మళ్లీ కాంగ్రెస్‌కి అధికారాన్ని కట్టబెడతారని ఆయన మీడియాతో అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస 6 గ్యారెంటీలను ఇచ్చింది, వాటిని అమలు చేసింది, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో 12 హామీలు ఇచ్చామని అన్నారు. రూ.500లో ఎల్‌పీజీ సిలిండర్, మహిళలకు రూ.1500, రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణమాఫీ, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం, రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ), నిరుద్యోగ యువతకు భృతి, పాఠశాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు మొదలైన హామీలు ఇచ్చామని ఆయన వెల్లడించారు.

కర్ణాటకలో కాంగ్రెస్ హామీలను ప్రధాని మోడీ ఉచితాలుగా అభివర్ణించారని, అయితే ప్రధాని మోడీ వాటిని స్వీకరిస్తున్నారంటూ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల కోసమే పొత్తు పెట్టుకున్నామని, ఇండియా కూటమి గురించి మాట్లాడారు. కాంగ్రెస్‌తో పాటు 25 కంటే ఎక్కువ పార్టీలు ఉన్న ఇండియా కూటమి ప్రజాస్వామ్య కూటమని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని, కర్ణాటక గెలుపుకు సహకరించిందని, వచ్చే ఐదు రాష్ట్రాల్లో ఇవే ఫలితాలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మేము బీజేపీతోనే కాడు, ఈడీ, సీబీఐలతో కూడా పోరాడుతున్నామని ఎద్దేవా చేశారు.

Exit mobile version