3 వారాల్లో గరిష్ట స్థాయికి కరోనా.. తాజా రీసెర్చ్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోన్న సమయంలో.. పలు రకాల రీసెర్చ్‌లు కోవిడ్ తీవ్రతను అంచనా వేస్తూ.. ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.. దేశంలో క్రమంగా కోవిడ్ మీటర్ మరోసారి పైకి పరుగులు పెడుతోన్న సమయంలో.. ప్రభుత్వ రంగ బ్యాకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎబ్బీఐ) తాజాగా నిర్వహించిన అధ్యయనం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.. భారత్‌లో కోవిడ్ థర్డ్ వేవ్ వ్యాప్తి మూడు వారాల్లో గరిష్ఠ స్థాయికి చేరుతుందని అంచనా వేసింది ఎస్బీఐ రీసెర్చ్.. ఇప్పటికే కోవిడ్ ఉధృతి కొనసాగుతోంది.. సిటీల్లో ప్రారంభమై ఇప్పుడు గ్రామీణకు కూడా పాకిపోయింది. అయితే, ఈ తీవ్రత ఎక్కువ కాలం ఉండకపోవచ్చని, వచ్చే మూడు వారాల్లో కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చన్నది అంచనా వేస్తోది ఎస్బీఐ.
Read Also: కోవిడ్‌పై కేంద్రం ఆందోళన.. రాష్ట్రాలకు కీలక ఆదేశాలు
Also Read
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Congress-TMC: కాంగ్రెస్‌లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్‌తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
ఇక, ముంబైలో ఈ నెల 7న 20,971 కొత్త కేసులు వెలుగు చూశాయి.. ఈ సీజన్లో ఇదే గరిష్ఠ స్థాయి.. ముంబైలో కోవిడ్ కేసుల సంఖ్య గరిష్ఠస్థాయికి చేరిన 2-3 వారాల్లో జాతీయ గరిష్ఠ స్థాయి నమోదయ్యే అవకాశం ఉందని ఎస్బీఐ పేర్కొంది.. ఇక, ఈ నివేదికలోని కీలక అంశాలను ఓసారి పరిశీలిస్తే.. కోవిడ్ కేసులు తారాస్థాయికి చేరిన పలు దేశాల్లోని పరిస్థితులను పరిగణలోకి తీసుకుంది.. యూఏఈ, చిలీ, సింగపూర్, చైనా తదితర దేశాలు 80 శాతానికి పైగా జనాభాకు టీకాలు వేశారని.. దీంతో, కొత్త కేసులు పెరుగుతున్నా మరణాల సంఖ్య తక్కువగా ఉందని పేర్కొంది.. ఇక, దక్షిణాఫ్రికా, యూఎస్‌ఏ, బ్రెజిల్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో ఇప్పటికే కరోనా థర్డ్ వేవ్ గరిష్ఠ స్థాయికి చేరి.. మళ్లీ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్టు తెలిపింది.. ఈ దేశాల్లో గరిష్ఠ స్థాయి నమోదు కావడానికి సగటున 54 రోజుల సమయం పట్టిందని పేర్కొన్న ఎస్బీఐ.. భారత్‌లో కేసుల సంఖ్య పెరగటం డిసెంబర్ 29వ తేదీ నుంచి మొదలైంది.. ఆ తర్వాత ఈ నెల 17వ తేదీకి వచ్చేసరికి రోజువారి కేసుల సంఖ్య 2.38 లక్షలకు చేరింది.. ఈ లెక్కన మూడు వారాల్లో కోవిడ్ గరిష్ఠస్థాయిని తాకుతుందని అంచనా వేసింది ఎస్బీఐ. ఇక, దేశంలో 64 శాతం ప్రజలకు ఇప్పటికే రెండో డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేశారు.. మరోవైపు.. ప్రజలు పెద్ద ఎత్తున కోవిడ్ బారినపడినా.. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్యమాత్రం తగ్గుతుంది.. దీనికి వ్యాక్సినేషనే కారణంగా చెబుతోంది.
తాజావార్తలు
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్‌కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్‌తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!