దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లే కనిపించిన మళ్లీ మూడు రోజులుగా క్రమంగా పెరుగుతున్నాయి. 30వేల దిగువకు వచ్చిన కేసులు.. గత 24 గంటల్లో 34,403 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 320 మంది మరణించారు. ముఖ్యంగా కేరళలో కరోనా తన ప్రతాపం చూపిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ 34,403 కేసుల్లో దాదాపు 65 శాతం కేసులు కేరళ నుంచి నమోదయ్యాయి.
గత 24 గంటల్లో కేరళలో 22,182 కోవిడ్ -19 కేసులు నమోదు కాగా, 178 మరణాలు నమోదయ్యాయి. బక్రీద్ సందర్భంగా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించడం, కేరళ ప్రభుత్వం ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసిన తరువాత కోవిడ్ -19 కేసుల్లో అకస్మాత్తుగా పెరుగుదల ఏర్పడింది. అప్పటినుండి, ఇది ఆపలేనంతగా మారింది. ప్రస్తుత కేసులు కేరళ ప్రజలను ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పెరుగుదల ఇలానే ఉంటే, మరోసారి లాక్ డౌన్ తప్పదేమో అనే సంకేతాలు కూడా ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రత్యేకబృందం కేరళ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది.
దేశంలో ప్రస్తుతం మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3,33,81,728.. వీటిలో 3,39,056 యాక్టివ్ కేసులు కాగా, 3,25,98,424 కోలుకోబడ్డారు. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,44,248.. గత 24 గంటల్లో, 63,97,972 టీకాలు నిర్వహించబడ్డాయి. దేశంలో ఇప్పటివరకు వేసిన మొత్తం టీకాలు 77,24,25,744..
