అభిషేక్ బదులు రణబీర్ ని డాడీ అనుకున్న ఐశ్వర్య కూతురు!

స్టార్స్ కిడ్స్ కి తమ మమ్మీ లేదా డాడీనే ఫేవరెట్ యాక్టర్ అవ్వాలన్న రూలేం లేదు. ఒక్కోసారి వారికి ఇతర హీరోలు, హీరోయిన్స్ కూడా ఎంతో నచ్చేస్తుంటారు. అయితే, అమితాబ్, జయా బచ్చన్ మనవరాలు, అభిషేక్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూతురు… ఆరాధ్య బచ్చన్ అభిమాన హీరో ఎవరో తెలుసా? రణబీర్ కపూర్!

ఇంట్లోనే బిగ్ బి, స్మాల్ బి, జయా, ఐష్… ఇంత మంది స్టార్స్ ఉన్నా కూడా ఆరాధ్యకి ఆర్కే నచ్చాడట! అదీ ఎంతగా అంటే… జూనియర్ ఐష్ అసలు ‘అంకుల్’ అని కూడా అనదట… రణబీర్ ని! ‘ఆర్కే’ అని సంబోధిస్తుందట! ఈ విషయం మరెవరో కాదు, స్వయంగా ఐశ్వర్య రాయ్ బచ్చన్ చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె తన ‘యే దిల్ హై ముష్కిల్’ కోస్టార్ గురించి ప్రస్తావించింది. అప్పుడే తన కూతురు రణబీర్ కి పెద్ద ఫ్యాన్ అంటూ రహస్యం బయటపెట్టింది. ఆరాధ్య అతడ్ని చూస్తే ‘సిగ్గు పడిపోతుంద’ని ఐష్ నవ్వుతూ చెప్పింది!

Read Also : నటిగా బిజీ అవుతున్న కె. బాలచందర్ కోడలు

ఓ సారి అభిషేక్ అనుకుని రణబీర్ ని వెనక నుంచీ వచ్చి హగ్ చేసుకుందట ఆరాధ్య! అతను వేసుకున్న జాకెట్, పెట్టుకున్న క్యాప్ కారణంగా అభీ లాగే కనిపించటంతో… బేబీ బచ్చన్ కన్ ఫ్యూజ్ అయిందట! ఇక ఇంకోక కొసమెరుపు ఏంటంటే… ఐశ్వర్య మొట్ట మొదటి సిల్వర్ స్క్రీన్ క్రష్‌… రణబీర్ తండ్రి రిషీ కపూరట! ఆమె కూతురు ఆరాధ్య ఫస్ట్ క్రష్ రిషీ కొడుకు రణబీర్! సర్కిల్… కంప్లీట్ అయిందంటోంది ఐశ్వర్య!

Related Articles

Latest Articles