COVID-19: మళ్లీ పెరుగుతోన్న కేసులు.. ఫోర్త్ వేవ్ తప్పదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి భారత్‌లో మరోసారి విజృంభిస్తోంది.. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ రూపంలో.. వివిధ వేరియంట్లుగా ప్రజలపై దాడి చేసిన మహమ్మారి.. మరోసారి పంజా విసిరుతోంది.. గత కొంతకాలంగా వెలుగు చూస్తోన్న రోజువారి పాజిటివ్ కేసులను పరిశీలిస్తే మళ్లీ టెన్షన్ మొదలైనట్టే కనిపిస్తోంది. థర్డ్ వేవ్ తర్వాత వందలకు పరిమితమైన కేసులు.. ఇప్పుడు మళ్లీ వేలను దాటేశాయి.. 10 వేల వైపు పరుగులు పెడుతోంది కరోనా రోజువారి కేసుల సంఖ్య.. దీంతో కరోనా ఫోర్త్ వేవ్ తప్పదా? ఇప్పటికే భారత్‌లోని వివిధ రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో ఫోర్త్ వేవ్ మొదలైందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Read Also: Rains in Telangana: అలర్ట్.. మరో మూడు రోజులు భారీ వర్షాలు
Also Read
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
- Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500... రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
తాజాగా వెలుగుచూస్తోన్న కేసులను పరిశీలిస్తే.. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటక తదితరల రాష్ట్రాల్లో ఒక్కసారిగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. ఈ పరిస్థితులను గమనిస్తే కోవిడ్ ఫోర్త్‌వేవ్‌లోకి అడుగుపెట్టినట్టుగానే భావించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు వైద్యనిపుణులు. ఇక, గత 10-15 రోజులుగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది నరేంద్ర మోడీ సర్కార్.. టెస్టింగ్, ట్రేసిండ్, ట్రీట్‌మెంట్ కొనసాగించాలని.. టెస్టులు పెంచడంతో పాటు ఇన్‌ఫ్లుయెంజా వంటి అనారోగ్యాలపై పర్యవేక్షణ పెంచాలని, తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లపై అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. వర్షాకాలం మొదలవుతున్నందున.. సీజనల్ ఏది..? వైరస్ ఏది..? అనే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.
కరోనా థర్డ్‌వేవ్ సమయంలో బాధితుల్లో కనిపించిన స్వల్పలక్షణాలతో పారాసిటమాల్, దగ్గుమందులతోనే కొన్ని ప్రస్తుత కేసులు తగ్గిపోతుండగా.. ఒకటి, రెండు కేసులు సెకండ్ వేవ్‌లో మాదిరిగా ఊపిరితిత్తులపై కూడా ప్రభావాన్ని చూపుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక, మళ్లీ కరోనా కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కారణంగా పేర్కొన్నారు.. బీఏ.2 సబ్‌వేరియెంట్ కారణమని దాదాపు అన్ని శాంపిళ్ల సీక్వెన్సింగ్‌ను బట్టి స్పష్టమతుందని.. దీంతోపాటు మరో సబ్ వేరియెంట్ బీఏ.2.12.1 కూడా యూఎస్‌లో బయటపడిందని గుర్తుచేస్తున్నారు.. గతంలోని ఒమిక్రాన్ సబ్‌వేరియెంట్ల కంటే కూడా ఇది 25 శాతం ఎక్కువ ఇన్ఫెక్షన్‌కు గురిచేస్తుందని.. గతంలో ఒమిక్రాన్‌తో కోవిడ్ ఇన్ఫెక్షన్ బారినపడినవారు ఈ సబ్‌వేరియెంట్‌తో మరోసారి ఇన్ఫెక్షన్ బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. అయితే, ప్రస్తుతం కేసుల పెరుగుదలతో కరోనా ఫోర్త్ వేవ్ మొదలైనట్టు కాదని కూడా వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!