కరోనా మహమ్మారి నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 2020 నుంచి దేశాన్ని మహమ్మారి పట్టిపీడిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా చాలా రంగాలు దెబ్బతిన్నాయి. అందులో పర్యాటక రంగం కూడా ఒకటి. కరోనా కారణంగా పర్యాటక రంగం భారీగా దెబ్బతిన్నది. దీనిపై ఆధారపడిన వేలాది మంది పూర్తిగా నష్టపోయారు. ఇలా నష్టపోయిన వారిలో కేరళకు చెందిన రాయ్ టూరిజం కూడా ఒకటి. రాయ్ టూరిజంకు 20 టూరిస్ట్ బస్సులు ఉన్నాయి. కరోనా కారణంగా నష్టాలు రావడంతో బస్సులను అమ్మేయ్యాలని నిర్ణయించుకున్నారు.
Read: Concept Restaurant: ఆకట్టుకుంటున్న ఖైదీ బిర్యానీ… ఎగబడుతున్న ఆహారప్రియులు…
బస్సులను తుక్కుగా భావించి కిలో రూ. 45 చొప్పున అమ్మేసినట్లు జోసెఫ్ పేర్కొన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రస్తుతం బస్సులు తిరుగుతున్నా అంతంతమాత్రంగానే ఉందని, వారం రోజుల వ్యవధిలో కేవలం మూడు బస్సులు మాత్రమే మున్నార్ ట్రిప్‌కు వెళ్లొచ్చాయని అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బస్సులను అమ్మేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.