Site icon NTV Telugu

Covid-19 Cases: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..! ఆ రాష్ట్రంలోనే ఎక్కువ రోగులు..

Corona

Corona

Covid-19 Cases: భారతదేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో పాటు మరణాలు కూడా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇవాళ (మంగళవారం) ఉదయం వరకు దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేల మార్కును దాటింది. గడిచిన 24 గంటల్లో ఐదుగురు కరోనా సోకి చనిపోయారు. అయితే, ప్రస్తుతం దేశంలో కరోనా బారిన పడిన రాష్ట్రాలలో కేరళ అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ ఉన్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Read Also: Telangana Jagruthi : ఇందిరా పార్క్‌ వద్ద రేపు తెలంగాణ జాగృతి మహాధర్నా

కాగా, దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో కేరళ మొదటి స్థానంలో కొనసాగుతుండటంతో అధికారులు తగిన చర్యలు చేపట్టారు. మంగళవారం ఒక్కరోజే కేరళలో 171 కొత్త కేసులు నమోదు అయినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పటి వరకు 1,416కి చేరింది. ఇక, ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 393కు చేరగా, మహారాష్ట్రలో 69 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య 494కు చేరుకుంది. పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా 11 కేసులు నమోదు అవగా.. ఆ రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 372గా ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది.

Read Also: Venkateswara Rao: జగన్‌పై దాడి కేసు.. పోలీసుల దెబ్బలకు నేటికీ అన్నం తినలేని పరిస్థితిలో బాధితులు..!

అయితే, ఇండియాలోని దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో కొవిడ్ కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్లే కారణమని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహల్ ధృవీకరించారు. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న ఈ సబ్ వేరియంట్లు తీవ్రమైనవి కాదని స్పష్టం చేశారు. తాజా, పరిస్థితి ప్రజలు గమనిస్తూ, అప్రమత్తంగా ఉండాలి.. కానీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. ఆరోగ్య నిపుణుల సూచనల మేరకు తగిన జాగ్రత్తలు పాటిస్తూ.. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Exit mobile version