Supreme Court: భార్య “లవర్”ని పోలీస్ స్టేషన్‌లో కాల్చి చంపిన కానిస్టేబుల్.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే..
- రెండు దశాబ్ధాల నాటి హత్య కేసు..
- భార్య లవర్‌ని చంపేసిన కానిస్టేబుల్..
- యావజ్జీవ శిక్షను సమర్థించిన అత్యున్నత ధర్మాసనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: రెండు దశాబ్ధాల క్రితం చోటు చేసుకున్న హత్యలో నిందితుడికి యావజ్జీవ శిక్షని సుప్రీంకోర్టు సమర్థించింది. భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్న వ్యక్తిని పోలీస్‌స్టేషన్‌లోనే కానిస్టేబుల్ అయిన భర్త తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చి చంపాడు. బాధితుడు తనను చంపేందుకు వచ్చాడని, ఆత్మరక్షణ కోసమే తాను చంపాల్సి వచ్చిందని, దీనిని హత్యగా చెప్పలేమని నిందితుడు సురేందర్ సింగ్ చేసిన విజ్ఞప్తిని జస్టిస్ సుధాన్షు ధులియా, రాజేష్ బిందాల్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.
Read Also: Hathras Stampede: పక్కటెముకలు విరగడం, ఊపిరాడకపోవడంతో మరణాలు..
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
మరణించిన వ్యక్తిపై గాయాలు, తుపాకీ కాల్పులు ఇవన్నీ హత్య అనే వాస్తవాన్ని సూచిస్తున్నాయని, చివరకు నిందితుడు తాను అనుకున్నది సాధించాడని, ఇది తక్కువ పరిమాణం ఉన్న కేసు కదాని న్యాయమూర్తి ధులియా 23 పేజీల తీర్పులో పేర్కొన్నారు. ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అతడి మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను రద్దు చేసింది. ప్రస్తుత కేసు ఢిల్లీలోని పోలీస్ స్టేషన్‌లో జరిగిన దారుణ హత్య అనే వాస్తవాలను వెల్లడిస్తాయని చెప్పింది. నిందితుడు నాలుగు వారాల్లో ట్రయల్ కోర్టు ముందు లొంగిపోవాలని తీర్పు చెప్పింది.
కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. చనిపోయిన వ్యక్తి, దోషి సమీప బంధువును పెళ్లి చేసుకున్నాడు. అతని ఇంటికి సమీపంలోనే ఉండేవాడు. బాధితుడు, ఆ సమయంలో కానిస్టేబుల్‌గా ఉన్న సురేందర్ సింగ్ భార్యతో అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నాడు. జూన్ 30, 2002న మయూర్ విహార్ పోలీస్ స్టేషన్‌లో బాధితుడు వెళ్లిన సందర్భంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇతర పోలీస్ సిబ్బంది చూస్తుండగానే, దోషి తన అధికారిక 9-ఎంఎం కార్బైన్‌తో బాధితుడిని చంపేశాడు.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!