Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీద్ కమిటీకి ఎదురుదెబ్బ.. సర్వే ఆపేది లేదని స్పష్టం చేసిన కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gyanvapi Mosque: కాశీలో జ్ఞానవాపి మసీదుపై వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. గతంలో వారణాసి కోర్టు తీర్పును అనుసరించి వీడియో సర్వే చేయగా, మసీదులోని వాజుఖానాలోని బావిలో శివలింగం వంటి నిర్మాణం వెలుగులోకి వచ్చింది. అంతే కాకుండా మసీదు వెలుపలి గోడలపై హిందూ దేవీదేవతల బొమ్మలను గుర్తించారు. ఈ కేసుపై అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా విచారించాయి. హిందువులు వాజూఖానాలోని కనిపించింది శివలింగం అని చెబుతుంటే.. ముస్లింలు మాత్రం ఇది ఫౌంటేన్ అని తమ వాదన వినిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో శాస్త్రీయ సర్వేను చేపట్టింది. అయితే దీనిని నిలిపివేయాలని జ్ఞాన్‌వాపి మసీదు నిర్వహణ కమిటీ అంజుమన్ ఇంతేజామియా కోర్టుకును కోరింది. కమిటీ వేసిన పిటిషన్ ని విచారించిన వారణాసి జిల్లా కోర్టు సర్వేను ఆపేది లేదని స్పష్టం చేసింది. ఇప్పటికీ ఈ సర్వేకు అలహాబాద్ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు అనుమతి లభించిందని జస్టిస్ ఎకే విశ్వేష్ అన్నారు. అందువల్ల కోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని న్యాయమూర్తి తెలిపారు.
Also Read
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
Read Also: Pakistan: టీవీ లైవ్ డిబెట్‌లో పొట్టుపొట్టు కొట్టుకున్నారు.. పాకిస్తాన్ అంటే ఇంతే మరి..!
17వ శతాబ్ధపు మసీదు హిందూదేవాలయంపై నిర్మించబడిందో లేదో తెలుసుకోవడానికి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న మసీదు ప్రాంతంలో శాస్త్రీయ సర్వే నిర్వహిస్తోంది. అయితే నిర్దేశిత నిబంధనలకు విరుద్ధంగా ఏఎస్ఐ సర్వే జరుగుతోతందని మసీదు కమిటీ జిల్లా కోర్టులో వాదించిందని ప్రభుత్వం తరుపు న్యాయవాది రాజేష్ మిశ్రా తెలిపారు. పిటిషన్ వేసిన వారికి ఎలాంటి నోటీసులు అందలేదని, ఎలాంటి ఫీజు చెల్లించలేదని మసీదు కమిటీ వాదించింది.
జ్ఞాన్‌వాపి మసీదులోని వాజూఖానాలో సర్వే చేయాలన్న హిందూ పక్షం పిటిషన్ ను కూడా కోర్టు విచారించిందని, ఈ అంశంపై అక్టోబర్ 5వ తేదీకి కోర్టు విచారణను వాయిదా వేసిందని మిశ్రా తెలిపారు. వారణాసి జిల్లా కోర్టు సర్వే ఉత్తర్వులను అలహాబాద్ హైకోర్టు సమర్థించిన తర్వాత సర్వే ప్రారంభమైంది. న్యాయ ప్రయోజనాల దృష్ట్యా సర్వే అవసరం అని కోర్టు తెలిపింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
తాజావార్తలు
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి