NTV Telugu Site icon

PM Modi: “ప్రధాని మోడీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలి”.. ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే..?

Pm Modi

Pm Modi

PM Modi: ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి’ని ఉల్లంఘించారని, ఆయన ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఈ పిటిషన్‌ని హైకోర్టు సోమవారం కొట్టేసింది. ఈ పిటిషన్ ‘పూర్తిగా తప్పుగా భావించబడింది’ అని పేర్కొంది. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ర్యాలీలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ప్రధానిపై ఆరేళ్లు అనర్హత వేటు వేయాలని న్యాయవాది ఆనంద్ ఎస్ జోంధాలే పిటిషన్ దాఖలు చేశారు.

Read Also: Konda Visveshwar Reddy: ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి..

ఈ కేసును జస్టిస్ సచిన్ దత్తాలో కూడిన సింగిల్ జడ్జ్ బెంజ్ విచారించింది. ఏ ఫిర్యాదుపైనా ప్రత్యేక చర్య తీసుకోవాలని ఎన్నికల సంఘానికి హైకోర్టు మార్గనిర్దేశం చేయలేదని పేర్కొంది. పిటిషనర్ ఇప్పటికే దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని, ఎన్నికల సంఘం దీనిపై స్వతంత్ర అభిప్రాయాన్ని తీసుకోవచ్చని కోర్టు పేర్కొంది. ఫిర్యాదును సక్రమంగా విచారించి ఉత్తర్వులు జారీ చేస్తామని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది సిద్ధాంత్‌కుమార్‌ పేర్కొన్నారని కూడా పేర్కొంది.

ఏప్రిల్ 9న యూపీలోని పిలిభిత్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ హిందూ, సిక్కు దేవతల్ని ప్రస్తావించారని పిటిషనర్ ఆనంద్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని ఇండియా కూటమి పార్టీలు ఎప్పుడూ అసహ్యించుకుంటున్నాయని ప్రధాని తన ప్రసంగంలో అన్నారు. ‘‘వారు రామాలయం యొక్క ‘ప్రాణ ప్రతిష్ఠ’ ఆహ్వానాన్ని తిరస్కరించారు మరియు రామ్ లల్లాను అవమానించారు. వేడుకకు హాజరైన ఆ పార్టీకి చెందిన వారిని ఆరేళ్ల పాటు పార్టీ నుండి సస్పెండ్ చేశారు’’ అని ప్రధాని అన్నారు. ఇండియా బ్లాక్ శక్తిని అంతం చేయాలని చెబుతోందని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా శక్తిని ఆరాధించే వారెవరూ కాంగ్రెస్‌ని క్షమించరని అన్నారు.