Site icon NTV Telugu

Forced Conversion: బలవంతపు మత మార్పిడికి రాజ్యాంగం మద్దతు ఇవ్వదు..

Allahabad High Court

Allahabad High Court

Forced Conversion: బలవంతంగా మతం మార్చడం తీవ్రమైన అంశమేనని అలహాబాద్ హైకోర్టు తేల్చి చెప్పింది. బలవంతపు మత మార్పిడి రాజ్యాంగ విరుద్ధమని పేర్కొనింది. భారతదేశంలో నివాసం ఉంటున్న వారంతా ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం ముందుకు నడుచుకోవాలని సూచించింది. అయితే, భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి తమ మతాన్ని స్వేచ్ఛగా అనుసరించడం, వ్యాప్తి చేసే హక్కును ఇచ్చినప్పటికీ, బలవంతపు మత మార్పిడులకు మాత్రం మద్దతు ఇవ్వదని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ చట్టం, 2021 కింద నిందితులుగా ఉన్న నలుగురిపై ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలన్న పిటిషన్‌ను తిరస్కరిస్తూ జస్టిస్ వినోద్ దివాకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

అయితే, డబ్బు, ఉచిత వైద్యం అందిస్తామని మోసపూరిత హామీలతో ప్రజలను హిందూ మతం నుంచి క్రైస్తవంలోకి మార్చడానికి కొందరు నిందితులు ప్రయత్నించారు. దీంతో వారిపై యూపీ చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేద చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. తమపై నమోదైన కేసులు కొట్టివేయాలని అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ వినోద్ దివాకర్ మాట్లాడుతూ.. భారతదేశ రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కింద మత స్వేచ్ఛ హక్కును కలిగి ఉన్నారు.. కానీ, మత ప్రచారం ముసుగులో బలవంతంగా మత మార్పిడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందన్నారు.

Read Also: Bill Gates: 2045 నాటికి మెరుగైన ప్రపంచం కోసం బిల్ గేట్స్‌ ఛాలెంజ్‌.. 200 బిలియన్‌ డాలర్ల సాయం..!

ఇక, మత స్వేచ్ఛను వినియోగించుకోవడం వల్ల సామాజిక నిర్మాణం దెబ్బతినకుండా చూడాలని అలహాబాద్ హైకోర్టు పేర్కొనింది. ఒక మతం మరొక మతం కంటే స్వతహాగా ఉన్నతమైనదనే భావన, ఆ మతంలోని నైతిక, ఆధ్యాత్మిక ఆధిపత్యాన్ని స్పష్టంగా సూచిస్తుంది అన్నారు. ఇటువంటి భావన రాజ్యాంగంలోని లౌకికవాద ఆలోచనకు విరుద్ధం అని తెలిపారు. భారత్ లౌకికవాదం దేశం అన్ని మతాలకు సమాన గౌరవం అనే సూత్రంలో నడుస్తుందన్నారు. రాష్ట్రంలో ఏ మతంతోనూ గుర్తింపు పొందకూడదు.. అన్ని మతాలు సమాన దూరాన్ని కొనసాగించాలని జస్టిస్ వినోద్ దివాకర్ వెల్లడించారు.

Exit mobile version