Site icon NTV Telugu

Shashi Tharoor: శశిథరూర్ విషయంలో దిద్దుబాటు చర్యలు.. కాంగ్రెస్ తాజా ప్లాన్ ఇదే!

Shashi Tharoor

Shashi Tharoor

శశిథరూర్.. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. ప్రస్తుతం తిరువనంతపురం లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. అయితే చాలా కొద్దిరోజులుగా కాంగ్రెస్ పార్టీతో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. బీజేపీ నేతలతో ఎక్కువగా చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారు. ప్రధాని మోడీని పదే పదే మెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శశిథరూర్‌ను పట్టించుకోవడం మానేసింది. ఇటీవల కేరళలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి కూడా శశిథరూర్ దూరయ్యారు. దీంతో రకరకాలైన ఊహాగానాలు వినిపించాయి. అంతేకాకుండా విభేదాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి.

ఇది కూడా చదవండి: Rahul Gandhi: ప్రొటోకాల్‌పై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రగడ.. ‘ఎట్ హోమ్’ నుంచి వెళ్లిపోయిన రాహుల్‌గాంధీ, ఖర్గే

అయితే త్వరలోనే కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విభేదాలు కొనసాగితే పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని సీనియర్లు భావిస్తు్న్నారు. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని యోచిస్తోంది. శశిథరూర్‌తో తలెత్తిన విభేదాలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ సన్నద్ధం అవుతోంది.

ఇది కూడా చదవండి: Chinmayi : అవకాశాల కోసం శరీరం అడిగేవాళ్లు – చిరు మాటలపై చిన్మయి షాకింగ్ కౌంటర్

శశిథరూర్ ఫిర్యాదులను పరిష్కరించేందుకు కాంగ్రెస్ సీనియర్లు ఆహ్వానించవచ్చని వర్గాలు పేర్కొన్నాయి. ‘‘నేను చెప్పగలిగేది ఏమిటంటే.. నా సొంత పార్టీ నాయకత్వంతో నేను చర్చించాల్సిన సమస్యలు ఉన్నాయి. బహిరంగ వేదికపై కాదు… నేను పార్లమెంటు కోసం ఢిల్లీకి వెళ్తాను. నా ఆందోళనలను పార్టీ నాయకత్వానికి స్పష్టంగా తెలియజేయడానికి. వారి అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి. సరైన సంభాషణ జరపడానికి నాకు అవకాశం లభిస్తుందని నేను నమ్ముతున్నాను.’’ అని శశిథరూర్ పేర్కొన్నారు. ‘‘నేను గత 17 సంవత్సరాలుగా కాంగ్రెస్‌లో ఉన్నాను. మనం ఎక్కువ దూరం వెళ్లకూడదు… నా విషయానికొస్తే.. ఏది తప్పు జరిగిందో.. దానిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. తగిన వేదికలో పరిష్కరించబడుతుంది.’’ అని శశిథరూర్ పీటీఐతో వ్యాఖ్యానించారు.

Exit mobile version