Site icon NTV Telugu

Bihar Elections: మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్.. విడివిడిగానే విపక్షాలు పోటీ

Congress

Congress

బీహార్‌లో ఎన్నికల సమరం కొనసాగుతోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇక ఎన్డీఏ కూటమి కలిసి పోటీ చేస్తుండగా.. విపక్ష కూటమి మాత్రం ఎవరికి వారే విడివిడిగా పోటీ చేస్తున్నారు. తొలి విడత పోలింగ్‌కు నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. రెండో విడత పోలింగ్ కోసం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: Gaza-Israel: గాజాలో మళ్లీ టెన్షన్ వాతావరణం.. తాజా దాడుల్లో 26 మంది మృతి

ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాను విడుదల చేసింది. ఆరుగురు సభ్యులతో కూడిన జాబితాను హస్తం పార్టీ ప్రకటించింది. రెండు విడతల్లో జరిగే ఎన్నికల్లో మొత్తం ఇప్పటి వరకు 59 మంది అభ్యర్థులను కాంగ్రెస్ వెల్లడించింది. తొలి జాబితాలో 48 మంది, రెండో జాబితాలో ఐదుగురు, తాజాగా సోమవారం మరో ఆరుగురు అభ్యర్థుల లిస్టును విడుదల చేసింది. ఇలా మొత్తం 59 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది.

తొలి విడతలో 121 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఆయా స్థానాల్లో విపక్ష పార్టీ సభ్యులు పరస్పరం పోటీ పడుతున్నాయి. ఇప్పుడు రెండో విడత పోలింగ్‌లో కూడా అదే పరిస్థితి నెలకొంది.

ఇది కూడా చదవండి: Heavy Rainfall Alert: మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన..

బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు వరకు విపక్ష కూటమి కలిసే ఉంది. ఓటర్ యాత్ర పేరుతో రాష్ట్రమంతా చుట్టేశారు. తీరా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక మాత్రం సీన్ రివర్స్ అయింది. సీట్ల పంపకాలలో తేడానో.. లేదంటే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై తిరకాసో తెలియదు గానీ.. చివరి నిమిషంలో ఇండియా కూటమి చీలిపోయింది. ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. సొంతంగానే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించుకుంటున్నాయి. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనుకున్న విపక్ష కూటమి కలలు కల్లలైనట్లుగానే కనిపిస్తోంది. చివరి నిమిషంలో ఎవరి దారి వారే చూసుకుంటున్నారు. విపక్ష కూటమి చీలికను ఎన్డీఏ కూటమి క్యాష్ చేసుకుంటోంది. ఆయా హామీలతో ప్రజల్లోకి దూసుకెళ్తోంది. ఫలితాలు ఎలా ఉంటాయో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.

బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ఈనెల 22తో ముగుస్తున్న ప్రస్తుత బీహార్ అసెంబ్లీ పదవీ కాలం.

Exit mobile version