దేశ రాజధాని ఢిల్లీలో హై టెన్షన్ నెలకొంది. విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు నిరసనగా ప్రధాని మోడీ నివాసం ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ కార్యకర్తలు, సీజేపీ నిరసనకారులు పాల్గొన్నారు. గూండాగిరి, నిరంకుశత్వం నశించాలంటూ చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసనలు తెలిపారు. ప్రధాని మోడీ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు మోడీ నివాసం ఎదుట నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు-నిరసనకారుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మరోవైపు పోలీసులతో రాహుల్ గాంధీ వాగ్వాదానికి దిగారు.
మరోవైపు ఢిల్లీలో సోమవారం జరిగిన సీజేపీ ఆధ్వర్యంలోని విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన లాఠీఛార్జ్‌లో తీవ్రంగా గాయపడిన 20 ఏళ్ల విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో ఆమెను ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా (RML) ఆస్పత్రి ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఈ వ్యవహారం ఢిల్లీలో హాట్‌టాఫిక్‌గా మారింది. ఈ ఘటనతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నెలకొంది. బాధిత విద్యార్థులను పరామర్శించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కేంద్ర మంత్రి జేపీ నడ్డా కూడా ఆస్పత్రికి వెళ్లారు. యువతి ఆరోగ్యంపై వైద్యుల నుంచి జేపీ నడ్డా వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. మెరువైన వైద్యం అందించాలని ఆదేశించారు.

