ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ కూడా సరికొత్త పథకాలను ప్రకటిస్తోంది. తాజాగా ‘‘జీవన్ రక్షా యోజన’’ కింద రూ. 25 లక్షల ఆరోగ్య భద్రత పథకాన్ని హస్తం పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ పథకాన్ని ప్రకటించారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తాజా పథకం ఢిల్లీ ప్రజలకు గేమ్ ఛేంజర్ లాంటిదని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: OG Movie : పవన్ కోసం దిగొచ్చిన శింబు.. ఈ సాంగ్ వేరే లెవల్
కొత్త పథకం ప్రకటన అనంతరం అశోక్ గెహ్లా్ట్ మాట్లాడారు. ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితులు మారిపోయాయన్నారు. కాంగ్రెస్ ప్రచారం బాగా చేస్తోందని.. ఈసారి ఫలితాలు భిన్నంగా ఉంటాయన్నారు. కాంగ్రెస్ గవర్నర్‌మెంట్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. ఢిల్లీ ప్రజలకు రూ.25 లక్షల ఉచిత ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. రాజస్థాన్‌లో ఈ పథకం చాలా విజయవంతమైందని చెప్పారు. ఇప్పుడు ఢిల్లీలో కూడా అదే చేస్తామని వివరించారు. ఆయుష్మాన్ భారత్ పథకమైతే పరిమితులు కలిగి ఉందని.. ఈ పథకానికి మాత్రం పరిమితులు లేవన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ మాట్లాడుతూ.. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు రూ.2,500 ‘‘ప్యారీ దీదీ యోజన’’ అమలు చేస్తామని ప్రకటించారు. కర్ణాటకలో విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Mahindra XEV 9E, BE 6: మహీంద్రా XEV 9E, BE 6 టాప్ వేరియంట్స్ ధరలు, బుకింగ్ షెడ్యూల్ రిలీజ్..
ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఇక్కడ ఆప్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తలపడుతున్నాయి. ఇప్పటికే ఆప్ అభ్యర్థులను వెల్లడించింది. బీజేపీ తొలి జాబితాలో 29 మంది అభ్యర్థులను వెల్లడించగా.. కాంగ్రెస్ కొంత మంది పేర్లును ప్రకటించింది. ఇక ఆప్‌కు సమాజ్‌వాదీ పార్టీ మద్దతు తెలిపింది. ఇక బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు మాయావతి తెలిపింది.
ఇది కూడా చదవండి: Ras Kik Coco : రిలయన్స్ ” కిక్” ఇచ్చే కూల్ డ్రింక్.. టాటాకు పోటీగా..!