NTV Telugu Site icon

Delhi Elections: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. మహిళలపై వరాలు

Delhicongress

Delhicongress

దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. మహిళలే లక్ష్యంగా వరాలు జల్లులు కురిపించారు. కాంగ్రెస్‌ సీనియర్ నేత జైరాం రమేశ్‌, పార్టీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్‌ బుధవారం మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం జైరాం రమేశ్‌ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ ప్రజల కోసం ఐదు గ్యారెంటీలు ప్రకటించినట్లు తెలిపారు. గ్యారెంటీ అంటే పౌరుల హక్కు అన్నారు. ఢిల్లీలో అధికారంలోకి వస్తే కులగణన నిర్వహిస్తామని.. అలాగే పూర్వాంచల్ వాళ్ల కోసం ఒక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: PMA Salam: పురుషులు-మహిళలు సమానం కాదు.. ముస్లిం లీగ్ నాయకుడి వివాదాస్పద ప్రకటన

ఇక మేనిఫెస్టోలో ప్రాముఖ్యంగా రూ.25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా, మహిళలకు రూ.2,500 సాయం చేస్తామని ప్రకటించింది. అలాగే కులగణన చేసి.. పూర్వాంచల్ కోసం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఇక వంట గ్యాస్ సిలిండర్ రూ.500లకే ఇస్తామని.. అలాగే ఉచిత రేషన్ కిట్ ఇస్తామని ప్రకటించింది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు, నిరుపేదలకు నెలకు రూ.5 వేల చొప్పున పింఛన్ ఇస్తామని తెలిపింది. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే నెల 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ నెలకొంది. నువ్వానేనా? అన్నట్టుగా పోటీ నెలకొంది.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy: కుల గణన సర్వేపై సీఎం రేవంత్ సమీక్ష.. త్వరలోనే కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక!