పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇక రాజ్యసభ్య ఛైర్మన్‌గా తొలిసారి సీపీ.రాధాకృష్ణన్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు. గత రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌ను ఊహించని రీతిలో ఆకస్మికంగా పంపేశారని గుర్తుచేశారు. కనీసం ఆయనకు వీడ్కోలు పలికే అవకాశం కూడా సభకు లభించలేదని తెలిపారు.
ఇది కూడా చదవండి: Maharashtra: మహిళలకు భర్తలు రూ.100 కూడా ఇవ్వరు.. ఎన్నికల ప్రసంగంలో ఓ మంత్రి కీలక వ్యాఖ్యలు
ఖర్గే వ్యాఖ్యలకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. మాజీ ఛైర్మన్ ధన్‌ఖర్ పట్ల కాంగ్రెస్ ఎలాంటి భాష ఉపయోగించిందో ఎవరూ మరిచిపోరన్నారు. ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు ఉపయోగించారో అందరికీ తెలిసిందేనని ఖర్గేను ఉద్దేశించి అన్నారు. చైర్ గౌరవాన్ని ఎంతగా దెబ్బతీశారో ఒకసారి గుర్తించుకోవాలని హితవు పలికారు. అయినా కొత్త ఛైర్మన్‌ను అభినందించే సమయంలో పాత విషయాలకు పోవడం భావ్యం కాదని ఖర్గేకు సూచించారు.
ఇది కూడా చదవండి: PM Modi: సీపీ.రాధాకృష్ణన్ ప్రజా సేవకే జీవితం అంకితం చేశారు.. చైర్మన్‌ను అభినందించిన మోడీ
అంతకముందు ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘‘పెద్దల సభా గౌరవాన్ని సభ్యులు గౌరవించాలి. సీపీ.రాధాకృష్ణన్ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చారు. రాధాకృష్ణన్ ప్రజా సేవకే తన జీవితాన్ని అంకితం చేశారు. తెలంగాణ, పుదుచ్చేరి, మహారాష్ట్ర, జార్ఖండ్ గవర్నర్‌గా పని చేశారు. అర్థవంతమైన చర్చలు జరిగితే సభకు సార్థకత వస్తుంది.’’ అని మోడీ తెలిపారు. డిసెంబర్ 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి.
