Congress President Elections: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. అనేక మలుపులు తిరుగుతున్న ఈ ఎన్నికలు ప్రస్తుతం ఓ కొలిక్కివచ్చాయి. కాంగ్రెస్ అధ్యక్షఎన్నికల కోసం మల్లికార్జున ఖర్గేతో పాటు శశిథరూర్, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి కేఎన్ త్రిపాఠి నామినేషన్లు దాఖలు చేశారు. తాజాగా త్రిపాఠి నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో పోటీలో ఇద్దరే మిగిలారు. వీరిద్దరి మధ్యే పోటీ నెలకొననుంది.
త్రిపాఠి సమర్పించిన నామినేషన్ లో సరైన ప్రతిపాదించే వారి సంతకాలు సరిగ్గా లేకపోవడంతో ఆయన నామినేషన్ ను తిరస్కరిస్తున్నట్లు ఏఐసీసీ సెంట్రల ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ శనివారం వెల్లడించారు. నామినేషన్ ఉపసంహరణకు అక్టోబర్ 8 వరకు సమయంల ఉంది. ప్రస్తుతం ఖర్గేతో పాటు శశిథరూర్ మాత్రమే పోటీలో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరైనా నామినేషన్ ఉపసంహరించుకుంటే.. ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్నిక అవుతారు. లేకపోతే అక్టోబర్ 17న ఎన్నికలు జరగుతాయి. అక్టోబర్ 19మంది ఫలితాలను వెల్లడిస్తారు. దాదాపుగా 25 ఏళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి గాంధీయేతర వ్యక్తులకు దక్కబోతోంది.
Read Also: Chintakayala Vijay: చింతకాయల విజయ్ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రధానంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఉంటారని అంతా అనుకున్నప్పటికీ.. అనేక రాజకీయ పరిణామాల మధ్య ఆయన పోటీ నుంచి విరమించుకున్నారు. సచిన్ పైలెట్ కు రాజస్థాన్ సీఎం పదవిని అప్పగించేందుకు గెహ్లాట్ సుముఖంగా లేకపోవడంతో రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం తలెత్తింది. ఏకంగా 92 మంది ఎమ్మెల్యేలు అధిష్టానంపై తిరుగుబాటు చేశారు. గెహ్లాట్ కు మద్దతుగా రాజీనామాకు సిద్ధపడ్డారు. దీంతో అధిష్టానం కూడా ఏం చేయలేకపోయింది.
అనూహ్యంగా మల్లికార్జున ఖర్గే పేరు చివరి నిమిషంలో తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ దళిత కార్డు ఉపయోగించుకుని.. సానుభూతి సంపాదించుకునేందుకు ఖర్గేను అధ్యక్షఎన్నికల బరిలో నిలబెట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు ఖర్గే దక్షిణ భారతానికి చెందని వ్యక్తి కావడం, రానున్న రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటంతో ఖర్గేను అనూహ్యంగా ఎన్నికల బరిలో నిలబెట్టారు. దీనికి తగ్గట్లుగానే ఖర్గేకు ఇప్పటికే 30 మందికి పైగా కాంగ్రెస్ నేతలు మద్దతు ప్రకటించారు.
