Gujarat Elections: ప్రధాని మోదీ, అమిత్ షాలపై కాంగ్రెస్ ఫిర్యాదు.. రోడ్ షోపై రచ్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress objects to Modi’s ‘roadshow’, questions ECI’s silence: గుజరాత్ ఎన్నికలకు సంబంధించి రెండో విడత పోలింగ్ ఈరోజు జరుగుతోంది. ఈనెల 8న గుజరాత్ తో పాటు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇదిలా ఉంటే ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రధాని మోదీ. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అహ్మదాబాద్‌లోని రాణిప్‌లోని నిషాన్ పబ్లిక్ స్కూల్లో ఓటు వేసేందుకు వెళ్తున్న ప్రధాని నరేంద్రమోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య పండుగను గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ ప్రజలు ఘనంగా జరుపుకున్నారని.. నేను దేశ ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాని.. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు ఎన్నికల సంఘాన్ని కూడా అభినందిస్తున్నాని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Read Also: COVID-19: కోవిడ్ “మానవ నిర్మిత వైరస్”.. సంచలన విషయాన్ని వెల్లడించిన సైంటిస్ట్
Also Read
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
ఓటు వేసిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షాలు రోడ్ షో చేయడంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మోదీ రోడ్ షో పై కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు సైలెంట్ గా ఉంటుందని ప్రశ్నించింది. రెండో దశ పోలింగ్ సమయంలో బీజేపీ ప్రచారం చేస్తుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీ, అమిత్ షాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. పోలింగ్ రోజు ప్రధాని మోదీ ఓటు వేయడానికి వెళ్లినప్పుడు రెండున్నర గంటల పాటు రోడ్ షో చేశారని.. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని.. ఎన్నికల సంఘం ఒత్తడికి గురవుతున్నట్లు కనిపిస్తోందని పవన్ ఖేరా అన్నారు.
కాంగ్రెస్ పార్టీ తరుపున గిరిజన నాయకుడు కాంతి ఖరాడి రక్షణ కోరుతూ ఈసీకి లేఖ రాశారు. అయినా ఈసీ స్పందించలేదు.. ఆ తరువాత అతనిపై బీజేపీ గుండాలు దాడి చేశారని అన్నారు. గుజ్ ప్రాంతంలో మద్యం నిషేధం ఉన్నప్పటికీ బీజేపీ మద్యం పంపిణీ చేసిందని ఆరోపించారు. ఈ రోడ్ షోపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా విమర్శలు గుప్పించారు. పోలింగ్ రోజు ఎన్నికల ప్రచారాన్ని ఈసీ నిషేధించింది. అయితే వారిద్దరికి మాత్రం మినహాయింపులు ఉండవచ్చు అని ప్రధాని మోదీ, అమిత్ షాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు దీదీ.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!