NTV Telugu Site icon

Karti Chidambaram: బంగ్లాదేశ్ ఎఫెక్ట్.. పొరుగు దేశాలపైన ప్రభావం ఉంటుంది

Kartichidambaram

Kartichidambaram

బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు గాడితప్పడంతో ఆ ప్రభావం పొరుగు దేశాలపైన ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సైన్యం సిద్ధమైందన్నారు. లా అండ్‌ ఆర్డర్‌ మొత్తం సైన్యం చేతుల్లోకి వెళ్లిపోయిందని చెప్పారు. త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆర్మీ చీఫ్ ప్రకటించారని పేర్కొన్నారు.

బంగ్లాదేశ్‌లో భారత పౌరులందరూ సురక్షితంగా ఉండేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. బంగ్లాదేశ్‌ నుంచి మన సరిహద్దుల్లోకి శరణార్ధుల ప్రవాహం లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. మన దేశ ప్రయోజనాలే ముఖ్యంగా భారత ప్రభుత్వం వెనుక అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఉంటాయని కార్తీ చిదంబరం చెప్పారు.

బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి ఢిల్లీ చేరుకున్న షేక్ హసీనా.. లండన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం 5:30కి హసీనా ఢిల్లీ చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌లో దిగారు. అక్కడ ఆర్మీ అధికారులు స్వాగతం పలికారు. ఇక ఢిల్లీ చేరుకున్న హసీనాతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ అయ్యారు. ఢాకాలో ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. ఢిల్లీ నుంచి హసీనా లండన్‌కు వెళ్లిపోనున్నట్లు సమాచారం.

Show comments