Mallikarjun Kharge: 2024 ఎన్నికల్లో బీజేపీని గద్దె దించుతామని, కాంగ్రెస్ ప్రతిపక్ష కూటమికి నేతృత్వం వహిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. భావసారుప్యం ఉన్న పార్టీలతో చర్చ జరుగుతోందని ఆయన వెల్లడించారు. ప్రధాని మోదీ అనేక సార్లు దేశాన్ని ఎదుర్కొనే ఏకైక వ్యక్తిని నేను, ఇతర వ్యక్తులు నన్ను తాకలేరని అన్నారని, ప్రజాస్వామ్యవాది ఎవరూ ఇలా అనరని, మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు, నియంత కాదని గుర్తుంచుకోవాలని సూచించారు. మీరు ప్రజలతో ఎన్నుకయ్యారు, వారే మీకు తగిన గుణపాఠం చెబుతారని నాగాలాండ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన అన్నారు.
Read Also: Chhattisgarh: కొత్తగా పెళ్లైన జంట.. రిసెప్షన్‌కు ముందు కత్తిపోట్లతో మృతి.. అసలేం జరిగింది.
2024లో కేంద్రంలో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం వస్తుందని అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుందని, ఇతర పార్టీలో మాట్లాడుతున్నామని, ఒక వేళ కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఉండవని ఆయన అన్నారు. ప్రతీ పార్టీతో అభిప్రాయం పంచుకుంటున్నామని తెలిపారు. బీజేపీకి వచ్చే ఎన్నికల్లో మెజారిటీ రాదని, కాంగ్రెస్ తో పాటు మిత్రపక్షాలన్నీ కలిసి మెజారిటీ సాధిస్తాం అని అన్నారు. 100 మంది మోదీలు, అమిత్ షాలు వచ్చినా వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఆయన ఖర్గే స్పష్టం చేశారు.