NTV Telugu Site icon

Jairam Ramesh: యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా ఓకే.. మరి ఎన్టీఏ చీఫ్ పరిస్థితి ఏంటి..?

Jai Ram Ramehsh

Jai Ram Ramehsh

Jairam Ramesh: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్మన్ మనోజ్ సోనీ రాజీనామాపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవస్థను భ్రష్టు పట్టించిన వారు చాలా మంది ఉన్నారని పేర్కొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) చీఫ్ ప్రదీప్ కుమార్ జోషి ఎందుకు.. ఇప్పటి వరకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. యూపీఎస్సీలో కొనసాగుతున్న వివాదాల నేపథ్యంలో మనోజ్ సోనీతో రాజీనామా చేయించడం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

Read Also: Committee Kurrollu: ఆగష్టు 9న థియేటర్లలోకి వచ్చేస్తున్న కమిటీ కుర్రోళ్లు..

అయితే, యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీ వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేసినట్లు అధికారిక వర్గాలు ఇవాళ (శనివారం) తెలిపాయి. ఆయన పదవీకాలం 2029 మేలో ముగియనుంది. 2014 నుంచి అన్ని రాజ్యాంగ సంస్థల పవిత్రత, ప్రతిష్ట, స్వయంప్రతిపత్తి బాగా దెబ్బతిన్నాయని ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ పోస్ట్ చేశారు. నరేంద్ర మోడీ గుజరాత్ నుంచి తనకు ఇష్టమైన ‘విద్యావేత్త’లలో ఒకరిని 2017లో యూపీఎస్సీ సభ్యునిగా తీసుకు వచ్చారు.. 2023లో ఆరేళ్ల పదవీకాలానికి ఛైర్మన్‌గా నియమించారని ఆరోపించారు. కానీ ఈ సోకాల్డ్ విశిష్ట పెద్ద మనిషి ఇప్పుడు తన పదవీకాలం ముగియడానికి ఐదేళ్ల ముందు రాజీనామా చేశారు.. కారణాలు ఏమైనా కావొచ్చు.. యూపీఎస్సీలో జరుగుతున్న వివాదాల దృష్ట్యా ఆయనకు ఉద్వాసన తప్పదని స్పష్టంగా కనిపించిందని జైరాం రమేష్ వెల్లడించారు.