NTV Telugu Site icon

Adani- Congress: అమెరికాలో అదానీపై కేసు.. జేపీసీకి కాంగ్రెస్ డిమాండ్

Congress

Congress

Adani- Congress: గౌతమ్‌ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడంతో కాంగ్రెస్‌ పార్టీ రియాక్ట్ అయింది. ఆయన వ్యవహారాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) దర్యాప్తునకు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ చేసింది. లంచం, మోసం చేశారనే అభియోగాలపై అదానీతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు న్యూయార్క్‌ ఫెడరల్‌ ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఈ ఆరోపణలతో స్టాక్‌ మార్కెట్‌ సైతం భారీగా పడిపోయాయి. మరోపక్క, రాజకీయంగానూ ఈ వ్యవహారం తీవ్ర వివాదానికి దారి తీసింది.

Read Also: Deputy CM Pawan Kalyan: విశాఖ కాలుష్య నివారణకు చర్యలు.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

ఇక, గౌతమ్‌ అదానీపై యూఎస్ లో కేసు ఫైల్ కావడంతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా హమ్‌ అదానీ కె హై సిరీస్‌లో ఇప్పటి వరకు వందలాది ప్రశ్నలు సంధించాం.. కానీ, మోడీ- అదానీ బంధంపై వేసిన ప్రశ్నలకు ఇప్పటి వరకు ఆన్సర్ దొరకలేదని విమర్శించారు. మోదాని కుంభకోణంపై జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏర్పాటు చేయాలని విపక్షాలు 2023 జనవరి నుంచి డిమాండ్‌ చేస్తున్నాయని జైరాం రమేష్ వెల్లడించారు.

Read Also: Indian Railways: నవంబర్ చివరికి 370 రైళ్లలో 1000 కొత్త జనరల్ కోచ్‌లు

గతంలో గౌతమ్ అదానీ కంపెనీ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోంది.. ఖాతాల్లో కుట్ర చేస్తోందని అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఓ నివేదిక ఇవ్వడంతో.. తీవ్ర దుమారానికి దారి తీసింది. అయితే, ఈ ఆరోపణలను అదానీ సంస్థ ఖండించింది.. కానీ, ఆ తర్వాత కూడా ఈ మొత్తం వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనూ డిమాండ్‌ చేశాయి.

Show comments