Site icon NTV Telugu

PM Modi: వందేమాతరాన్ని కాంగ్రెస్ తుక్డే తుక్డే చేసింది..

Modi

Modi

PM Modi: లోక్‌సభలో వందేమాతరంపై జరుగుతున్న ప్రత్యేక చర్చ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై, భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ గతంలో జాతీయ గీతాన్ని “తుక్డే తుక్డే” చేసినట్టు ఆరోపించారు. అలాగే, వందేమాతరంతో ముస్లింలను రెచ్చగొట్టే విధంగా ఉందని నెహ్రూ పేర్కొన్నాడని చెప్పారు. సభలో “శేమ్‌ శేమ్‌” నినాదాలు వినిపించినప్పటికీ, మోడీ వ్యాఖ్యానిస్తూ.. గత శతాబ్దంలో కొన్ని శక్తులు జాతీయ గీతానికి సర్వనాశనం చేశాయని పేర్కొన్నారు. ఆ చరిత్రను వచ్చే తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనదేనని ప్రధాని మోడీ అన్నారు.

Read Also: Gangamma Temple EO Arrested: సంచలనంగా మారిన గంగమ్మ గుడి ఈవో దొంగతనం వ్యవహారం.. ఈవో మురళీ కృష్ణ అరెస్ట్..

ఇక, 1937లో మహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్‌ వందేమాతరానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించింది అని ప్రధాని మోడీ గుర్తు చేశారు. అయితే, కాంగ్రెస్, నెహ్రూలు ఆ పోరాటాన్ని ఎదిరించకుండా, వందేమాతరం పై విచారణకు ఆదేశాలు జారీ చేశారని విమర్శించారు. జిన్నా ఆందోళన తరువాత సుభాష్ చంద్ర బోస్‌కు నెహ్రూ రాసిన లేఖలో- వందేమాతరం మొత్తం చదివిన తరువాత అది ముస్లింలను రెచ్చగొట్టేలా ఉందని భావిస్తున్నానని ఆయన వెల్లడించారు. అలాగే, అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) కాలాన్ని గుర్తు చేసుకుంటూ.. వందేమాతరం 50 సంవత్సరాలు పూర్తయ్యే సమయానికి దేశం మొత్తం బ్రిటిష్ వారి పాలనలో ఉండగా.. 100 ఏళ్లు పూర్తి అయ్యే సమయానికి దేశంలో అత్యవసర పరిస్థితి దేశాన్ని కబలించిందన్నారు. స్వాతంత్ర్య సమరయోధులను జైలులో పెట్టిన ఆ కాలం భారత చరిత్రలో బ్లాక్ డేస్ గుర్తించబడిందని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.

Read Also: CBSE Recruitment 2025: ఇంటర్, డిగ్రీ అర్హతతో.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ లో జాబ్స్..

అయితే, వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ గీతానికి గౌరవం తిరిగి తీసుకురావాల్సిన సమయం ఇదేనని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. 1875లో బంకిమ్ చంద్ర చట్టోపాధ్యాయ రచించిన ఈ గీతం భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరిగా నిలిచిందని ప్రశంసించారు. వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పార్లమెంట్‌ ఉభయ సభల్లో 10 గంటల ప్రత్యేక చర్చను ఏర్పాటు చేసింది. ఈ చర్చలో ప్రతిపక్షం తరఫున ప్రియాంకా గాంధీ వాద్రా నాయకత్వం వహిస్తున్నారు.

Exit mobile version